Share News

Budget 2024: కేంద్ర బడ్జెట్లో విష్ణుపాద్, మహాబోధి ఆలయాల అభివృద్ధికి నిధులు.. !

ABN , Publish Date - Jul 24 , 2024 | 02:08 PM

పురాతన ఆలయాలు, కట్టడాలు మన దేశ చరిత్రను, ఖ్యాతిని నలుదిశలూ వ్యాప్తి చేసే మూలాలు. ఈ సంపదను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ రావడం మన అందరి బాధ్యత.

Budget 2024: కేంద్ర బడ్జెట్లో విష్ణుపాద్, మహాబోధి ఆలయాల అభివృద్ధికి నిధులు.. !
Indian Temples

పురాతన ఆలయాలు, కట్టడాలు మన దేశ చరిత్రను, ఖ్యాతిని నలుదిశలూ వ్యాప్తి చేసే మూలాలు. ఈ సంపదను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ రావడం మన అందరి బాధ్యత. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ చాలా వరకూ పురాతన ఆలయాలు, కట్టడాలు పాడుపడే స్థాయికి వస్తున్నాయి. ఈ పురాతన సంపదను చెక్కు చెదరనీయక వచ్చే తరాలకు అందించే దిశగా ప్రతి ఒక్కరి ప్రయత్నం ఉండాలి. ముఖ్యంగా వీటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వాలదే. దీనిలో భాగంగా కేంద్ర బడ్జెట్ 2024 లో బీహార్ గయాలోని విష్ణుపాద్ ఆలయాన్ని, బోధ్ గయలోని మహాబోధి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ స్థాయిలో పర్యాటకులను రప్పించే దిశగా వీటి అభివృద్ధి చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

నిర్మాలా సీతారామన్ మాట్లాడుతూ, పర్యాటకం ఎప్పుడూ మన నాగరితలో భాగమే అన్నారు. గయలోని విష్ణుపధ్ ఆలయం బుద్ధగయలోని మహాబోధి ఆలయాలకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. బీహార్లోని రాజ్ గిర్, నలందాలలో ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాశీ విశ్వనాథ్ కారిడార్ నమూనాలో కారిడార్లను ప్రతి ఆలయానికీ ఏర్పాటు చేస్తామన్నారు.

భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఉన్న బోధ్ గయ, ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

బీహార్, బోద్ గయాలో సందర్శించాల్సిన 5 ప్రసిద్ధ దేవాలయాలు ఏవంటే..

విష్ణుపాద్ ఆలయం..

ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన పుణ్య హిందూ దేవాలయం. ఇక్కడే విష్ణువు పాదముద్రలున్నాయని నమ్ముతారు. హిందూ యాత్రికులకు ముఖ్యమైన ప్రదేశం కూడా ఇదే.


మహాబోధి ఆలయం..

ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. బోధి వృక్షం క్రింద బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఇది.

థాయ్ మొనాస్టరీ..

దీనిని బుద్ధ గయ అని కూడా పిలుస్తారు. థాయ్ లాండ్, బోధ్ గయ మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను సూచించే ప్రదేశం ఇది. ఇక్కడి బౌద్ధ దేవాలయం, ఆశ్రమం చాలా ప్రఖ్యాత చెందినవి.

Benefits of Vitamin C : చర్మ సౌందర్యానికి విటమిన్ సి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది?

జెయింట్ బుద్ధ..

గ్రేట్ బుద్ధ విగ్రహం ఇక్కడ ఉంది. బోధ్ గయ ఐకానిక్ చిహ్నం ఇది. భారతదేశంలోని ఎత్తైన బుద్ధ విగ్రహాలలో ఇదీ ఒకటి.


టిబెటిన్ మొనాస్టరీ..

టిబెటిన్ మొనాస్టరీని కర్మ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది టిబెటన్ బౌద్ధులకు ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశం. టిబెటియన్ కళ, సంస్కృతి, మతపరమైన అంశాలకు ప్రతీక.

బౌద్ధ, హిందూ వారసత్వ సమ్మేళనాన్ని తెలిపే బోధ్ గయ ఆధ్యాత్మికత, సంస్కృతి సమ్మేళనం ఈ ప్రదేశాలు. జ్ఞానం, శాంతి కోరుకునే ప్రతి ఒక్కరికీ చూడదగ్గ ప్రదేశాలు ఇవి. ఆధ్యాత్మికం పరంగా తప్పక సందర్శించాల్సిన ముఖ్య ప్రదేశాలు.

Health Tips : అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లోనే ఎందుకు టైప్ 1 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ..!

Updated Date - Jul 24 , 2024 | 02:09 PM