AP NEWS: అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్ .. కారణమిదే..
ABN , Publish Date - Dec 27 , 2024 | 07:15 PM
Annamaiya district: వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనతో అధికారులు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు అక్రమ కేసులతో జైళ్లకు పోయారు.. మరి కొందరు వైసీపీ మూకల దాడుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయారు. ఓ అధికారిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.
అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వంలోనూ వారి దాడులు కొనసాగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఓ అధికారిపై విచక్షణ రహితంగా వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుకు తీవ్రగాయాలయ్యాయి. వైసీపీ మూకలు మూకుమ్మడిగా ఎంపీడీవోపై దాడికి పాల్పడ్డారు. ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నేత సుదర్శన్‌రెడ్డి, అనుచరులు కర్రలు, కుర్చీలతో దాడి చేశారు. తలుపుకు గడియపెట్టి ఎంపీడీవో జవహర్‌బాబును ఒంటరిగా చేసి కర్రలు , కుర్చీలు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గది తాళాలు అడిగితే ఇవ్వలేదని అక్కసుతో వైసీపీ నేతలు గొడవకు దిగారని అన్నారు. ఎంపీడీవో జవహర్‌బాబుకు గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఎంపీపీ గది తాళాలు ఇవ్వకపోవడంతోనే తనపై దాడి చేశారని ఎంపీడీవో జవహర్‌బాబు తెలిపారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో అన్నమయ్య జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు అక్కడ నుంచి పంపించివేశారు. ఎంపీడీఓను రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంపీడీవోను ఫోన్‌లో మంత్రి రాంప్రసాద్, కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు, టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Andhra Pradesh: ఈ దొంగోడి స్టైలే వేరు.. బట్టలన్నీ తీసేసి మరీ..
CM Chandrababu: మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది
Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి
Read Latest AP News And Telugu news