AP News: వైసీపీ @ అరాచకం
ABN , Publish Date - Nov 13 , 2024 | 08:16 AM
కడప అంటే ఇప్పటి దాకా కళలకు కాణాచి. చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. తిరుమల తిరుపతి(Tirumala Tirupati) తొలి గడప దేవునికడప ఇక్కడే ఉంది. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య, సామాజిక దురాగాతాలపై గళమెత్తిన వేమన, కాలజ్ఞానం బోధించిన వీరబ్రహ్మం ఇక్కడి వారే.
- అధికారం ఉన్నప్పుడు రౌడీయిజం, దందాగిరి
- సోషల్ మీడియాలో ఇష్టారాజ్యం
- వైసీపీని ప్రశ్నించిన కుటుంబాలే టార్గెట్
- మహిళలు, పిల్లలను కించపరిచే యత్నం
- కడప పేరును రాష్ట్రంలోనే గబ్బుపట్టించిన సైకో బ్యాచ్
- వీరిలో ఒకరు మాజీ సీఎం జగన్ భార్య పీఏ
- కొందరు ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరులు
- వీళ్ల నిర్వాకం చూసి అసహ్యించుకుంటున్న జనం
- పోలీసు చర్యలతో వైసీపీ సైకో అండ్ కో బ్యాచ్‌లో వణుకు
కడప అంటే ఇప్పటి దాకా కళలకు కాణాచి. చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. తిరుమల తిరుపతి(Tirumala Tirupati) తొలి గడప దేవునికడప ఇక్కడే ఉంది. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య, సామాజిక దురాగాతాలపై గళమెత్తిన వేమన, కాలజ్ఞానం బోధించిన వీరబ్రహ్మం ఇక్కడి వారే. అతిఽథులు వస్తేచాలు ఇంట్లో లేకున్నా.. అప్పు తెచ్చయినా ఆప్యాయంగా చూసుకోవడం ఇక్కడి జనం నైజం. అయితే వైసీపీ సోషల్ మీడియా(YCP social media)తో కడప అంటేనే అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది.
ఈ వార్తను కూడా చదవండి: కడప జిల్లాలో దెబ్బకు కర్నూలులో కాక!
వైసీపీ అధికారంలోకి వచ్చాక సరికొత్త రాజకీయానికి తెర లేసింది. నచ్చనివారిపై కేసులు పెట్టడం, ఆస్తి లాక్కోవడమే పనిగా సాగింది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా వైసీపీ మూకలు చెలరేగిపోయాయి. అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి(Sajjala Bhargava Reddy) వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చేపట్టాక వికృతరూపం దాల్చింది. జిల్లాకు చెందిన జగన్ అండ్ కో సోషల్ మీడియా బ్యాచ్ అచ్చోసిన అంబోతుల్లా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారాలోకేశ్ ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పోస్టు చేస్తుంటారు. వైసీపీ హయాంలో ఎవరైనా సామాన్యుడు జగన్‌ను ప్రశ్నించినా సరే భార్గవరెడ్డి, రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో సైకో ముఠా వారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ టార్చర్ చేసేవారు. సోషల్ మీడియానే గబ్బు పట్టించి కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించిన బ్యాచ్ కడప జిల్లాకు చెందిన వైసీపీవారు కావడం గమనార్హం.
(కడప-ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో టీడీపీ ఆవిర్భావానికి ముందు ఒకరకం రాజకీయాలు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో బడుగు, బలహీనవర్గాలకు చట్టసభల్లో తమ వాణిని వినిపించే అపురూపమైన అవకాశం దక్కింది. అందుకే టీడీపీ అంటే బీసీల పార్టీ అంటారు. కాంగ్రెస్‌కు ఎస్సీఎస్టీలు మైనార్టీలు అండగా ఉంటారని చెబుతారు. ఇక బీజేపీ హిందువుల పార్టీగా ముద్రపడింది. అయితే మాజీ సీఎం జగన్ నేతృత్వంలో స్థాపించిన వైసీపీ మాత్రం అబద్ధాలు, అసత్య ఆరోపణలు, బూతులపార్టీగా పేరొందింది.
ముఖ్యంగా సోషల్ మీడియా అంటేనే మొదట గుర్తుకు వచ్చేది వైసీపీనే. ఎందుకంటే 2019లో జరిగిన ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ఖాతాలను వైసీపీ సమర్థవంతంగా ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టాక కూడా వైసీపీ సోషల్ మీడియాలో అసత్యాల ప్రచారం మానలేదు. ఈ పిచ్చి ముదిరి వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్ సైకోల్లా తయారయ్యారు. ఉచ్ఛనీచాలు మరిచి డబ్బు కోసం కొందరు, ప్రాపకం కోసం మరికొందరు సభ్య సమాజమే తలదించుకునేలా పోస్టులు పెట్టారు. నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కూడా సోషల్ మీడియాలో అప్పటి ప్రతిపక్షాలు పెట్టిన పోస్టులు కూడా కారణమే.
ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సైకోలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. పరారీలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వర్రా రవీంద్రరెడ్డి, అతని అనుయాయులపై కేసులు నమోదు చేయడంతో ఒక్కసారి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్సార్ పాదాల చెంతన వైసీపీ పురుడు పోసుకుంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంది. ఇదే జిల్లాకు చెందిన ఈ వైసీపీ సోషల్ మీడియా సైకోల వల్ల రాష్ట్రంలోనే కాదు.. జనాల్లో కూడా ఆ పార్టీని థూ అనే విధంగా తయారయింది.
ఎంపీ అవినాశ్‌కు చుట్టుకుంటున్న వైనం
సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న వర్రా రవీంద్రెడ్డి కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. మాజీ సీఎం జగన్ భార్య భారతి వద్ద పీఏగా పనిచేశాడు. భారతి ఇంట్లో పనిచేసిన రవీంద్రరెడ్డి తరువాత వైసీపీలో క్రియాశీలకంగా మారాడు. సింహాద్రిపురానికి చెందిన హరి అనే దళితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవరెడ్డి బ్యాచ్‌పై కేసు నమోదైంది. కులాలను కించపరిచే విధంగా వర్రా రవీంద్రరెడ్డి పోస్టు చేస్తే వాటిని తీసేయాలని హరి కోరగా కులం పేరుతో అతడిని తిట్టడంతో పాటు రెండు లక్షలు డబ్బులు ఇవ్వు లేదంటే చంపేస్తానంటూ బెదిరించారు.
దీంతో హరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు డీఎన్‌ఎస్ యాక్ట్ మేరకు సెక్షన్ 196, 308 (5), 351 (3), 353 (సి) 112 (2), (బి) 6/డబ్ల్యు 3 (5) డీఎన్‌ఎస్ ఇక ఇతర సెక్షన్లు సెక్షన్ 3 (1) (6), (ఎస్), (3 ఆఫ్ ఎస్సీ ఎస్టీ అమెండెంట్ యాక్ట్ 2015 మరియు సెక్షన్ 67ఆఫ్ ఐటి యాక్ట్ మేరకు ఏ-1గా వర్రి రవీంద్రరెడ్డి, ఏ-2గా సజ్జల భార్గవరెడ్డి, ఏ-3గా సింగారెడ్డి అర్జున్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆయన పీఏ బండి రాఘవరెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అవినాశ్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి చెబితేనే తాను పోస్టులు పెట్టానని తెలిపాడు. తాడేపల్లి కేంద్రంగా వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆ బ్యాచ్ అంతా కడపకు చెందిన వారు కావడం గమనార్హం. వీరందరిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. సైకోల పోస్టుల వెనుక ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి హస్తం ఉందని వెలుగు చూస్తుండటం, వరుస అరెస్టులతో వైసీపీ కలవరపడుతోంది.
పోలీసులకు ఫిర్యాదులతో వైసీపీలో వణుకు
మనకు రాజ్యాంగం మాట్లాడే హక్కు కల్పించింది. ఏ పార్టీ అయినా సరే పార్టీ సిద్ధాంతాలను మీడియా, సోషల్ మీడియా, ఇతరత్రా మాధ్యమాల ద్వారా జనాల్లోకి తీసుకువెళ్లవచ్చు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రశ్నించవచ్చు. అయితే వైసీపీ జగన్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయేది. ముఖ్యంగా సజ్జల భార్గవరెడ్డి ఇన్‌చార్జి అయ్యాక.. ఇక అందులో అంతా బూతుపురాణమే. కాసులకోసం ఈయన బ్యాచ్ ఎంతనీచమైన పోస్టులు పెట్టేదానికైనా దిగజారింది. తమ ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నారనే ఇంగితజ్ఞానం మరిచి సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సైకోగా పేరొందిన వర్రా రవీంద్రరెడ్డి నీచమైన పోస్టులు పెట్టారు.
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం
ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్
Read Latest Telangana News and National News