Chandrababu: 2029 నాటికి ఏపీని దేశంలోనే నెంబర్ వన్‌గా మారుస్తా
ABN , Publish Date - Mar 30 , 2024 | 07:57 PM
సీఎం జగన్ (CM Jagan) లక్షల కోట్ల అప్పు ఏపీపై మోపారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అన్నారు. శనివారం నాడు శ్రీకాళహస్తిలో ’ప్రజాగళం‘ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 10 ఇచ్చి.. రూ100.. దోచే జలగ జగన్ అని ఎద్దేవా చేశారు.
తిరుపతి: సీఎం జగన్ (CM Jagan) లక్షల కోట్ల అప్పు ఏపీపై మోపారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అన్నారు. శనివారం నాడు శ్రీకాళహస్తిలో ’ప్రజాగళం‘ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 10 ఇచ్చి.. రూ100.. దోచే జలగ జగన్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగాడీఎస్సీ పైనే ఉంటుందని తెలిపారు. 2029కి దేశంలోనే నెంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్‌ని తయారు చేయడం తన విజన్ అని చంద్రబాబు చెప్పారు.
తమది సంక్షేమమని.. జగన్‌ది సంక్షోభమని అన్నారు. గుడిని గుడిలోని లింగాన్ని మింగేలా జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కమీషన్లు కబ్జాలు రౌడీయిజం ఆదాయ వనరులుగా జగన్ మార్చుకున్నారని మండిపడ్డారు. జనం జగన్ బెండు తీయడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. జగన్ అహంకారి, విధ్వంసకారుడు, అవినీతిపరుడని చెప్పారు. తాను ఎంతో మందిని చూశానని.. ఇలాంటి వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు.
KA Paul: నా సత్తా ఏంటో వైసీపీ నాయకులకి తెలియడం లేదు.. 7 రోజులు టైం ఇస్తున్నా..
తెలుగు తమ్ముళ్లపై కేసులు
తెలుగు తమ్ముళ్ల పైన కేసులు పెట్టిన జగన్ ఎక్కడ ఉన్న వదిలిపెట్టనని హెచ్చరించారు. జగన్ ది పోయే ప్రభుత్వమని.. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పాలన జరుగుతోందన్నారు. అయినా జగన్ తొత్తులుగా పనిచేసే అధికారులను వదిలిపెట్టనని మందలించారు. జగన్ ఆలోచనలు స్వార్థం కోసమని.. తన ఆలోచన ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసమని వివరించారు. చెన్నై, తిరుపతి, నెల్లూరు మూడు ప్రాంతాలను కలిపి ట్రైసిటీగా చేయాలనుకున్నామని చంద్రబాబు తెలిపారు.
కాణిపాకం, తిరుపతి, శ్రీకాళహస్తి ఈ ప్రాంతాలను కలిపి టూరిజం హబ్ చేయాలనుకున్నామని అన్నారు. శ్రీ సిటీ, కార్బన్, డిక్సన్, సెల్కాను వంటి ఎన్నో సంస్థలను ఏపీకి తీసుకొచ్చామని తెలిపారు. ఎన్నో సంస్థలను రాష్ట్రానికి తీసుకొని వస్తే వాటి నుంచి దందాలు జగన్ మొదలుపెట్టారని మండిపడ్డారు. జగన్ ఇలాంటి సంస్థలు తేకుండా బుంబుమ్, తదితర నకిలీ బ్రాండ్ల మద్యాన్ని ఏపీకి తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.
TG Politics: కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని.. కీలక పదవి!
టీడీపీ అధికారంలోకి వస్తే పెట్టుబడులు క్యూ
తన హయాంలో 200 కరెంటు బిల్లు వచ్చేదని.. ఇప్పుడు 1000 రూపాయలు వస్తుందని ఇది జగన్ మార్కు పాలన అని దెప్పిపొడిచారు. నాణ్యమైన మద్యం అప్పుడు 65 రూపాయలని.. నాణ్యత లేని మద్యం ఇప్పుడు 200 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పారు. అది జగన్ మార్కు అని సెటైర్లు వేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పెట్టుబడులు క్యూ కడుతాయన్నారు. జగన్ పాలన వచ్చాక పరిశ్రమలు పారిపోయాయని ఎద్దేవా చేశారు. తాను అనేక పరిశ్రమలు తీసుకొచ్చానని.. జగన్ వచ్చాక అమర్ రాజా వంటి పరిశ్రమలు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 11 డీఎస్సీలను విడుదల చేశామని... ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. దళితులకు రక్షణ తన మార్కు అని.. దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఇదా మార్పు అంటే అని చంద్రబాబు ప్రశ్నించారు.
AP Politics: వైసీపీని ప్యాక్ చేసేస్తోన్న ఐ ప్యాక్..!! ఏం జరిగిందంటే..?
దళితులను మోసం చేసిన జగన్
దళితుల సీట్లను ఇతర కులాలకు ఇచ్చి రాజకీయ సుస్థిరత లేకుండా చేసిన మార్క్ పాలన జగన్‌దన్నారు. రెడ్ల నియోజకవర్గాలల్లో మాత్రం వాళ్లనే కొనసాగించారని అన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తన హయాంలో నిర్మించానని తెలిపారు. నదుల అనుసంధానం, పోలవరం దాదాపు పూర్తి చేశానని వివరించారు.
2019 నుంచి ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి అయిందా ? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందా? ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. జగన్ చేసిన లక్షల కోట్ల అప్పులకి వడ్డీలు కడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చంద్రబాబు అన్నారు.
AP Politics: చంద్రబాబు నుంచి బండారుకు పిలుపు.. వైసీపీ బంపరాఫర్లు!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి