Chandrababu: బాంబులకే నేను భయపడలేదు...రాళ్లకు భయ పడతానా..?
ABN , Publish Date - Apr 14 , 2024 | 08:30 PM
బాంబులకే తాను భయపడలేదు...రాళ్లకు భయ పడతానా..? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఆదివారం నాడు గాజువాకలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: బాంబులకే తాను భయపడలేదు...రాళ్లకు భయ పడతానా..? అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఆదివారం నాడు గాజువాకలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu: గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు విసిరిన ఆకతాయిలు
ముఖ్యమంత్రిపై దాడికి ఎవరు బాధ్యులు...? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నది నువ్వా....నేనా..? అని నిలదీశారు. కరెంటు పోయిన సమయంలో రాళ్ల దాడి జరిగిందని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. తన మీద, తమ పార్టీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేసి... అక్రమ కేసులు పెట్టారని విరుచుకుపడ్డారు. తాను నేరాలు చేసేవాడిని కాదు... నేరగాళ్లను తుంగలో తొక్కేసే సామర్థ్యం ఉన్నవాడినని అన్నారు.
AP Election 2024: సీఎంపై రాయి విసిరిన కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఏం కేసు పెట్టారంటే?
నిన్న(శనివారం) ఎవరో జగన్‌పై గులక రాయి వేశారన్నారు. 24 గంటల అవుతోంది...చర్యలు ఏవీ? అని ప్రశ్నించారు. సీఎస్, డీజీపీకు బాధ్యత లేదా అని నిలదీశారు. తన మీద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు...ప్రజలు అన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..
నిన్న చీకటిలో జగన్‌పై గులక రాయి వేశారని .. ఇప్పుడు వెలుగులో తనపై రాళ్లు వేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాళ్ల దాడి చేస్తోంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాళ్లు వేసింది జే గ్యాంగ్ పనేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ సహకారంతోనే విశాఖ పోర్టుకు డ్రగ్స్ దిగుమతి అవ్వలేదా అని ప్రశ్నించారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలో జగన్ ప్రభుత్వమే దోషి అని విరుచుకుపడ్డారు. డ్రగ్స్ నివారించమని అడిగితే టీడీపీ ఆఫీసుపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగం మంచిదైనా అమలు చేసేవారు మంచివారు కాకపోతే ప్రయోజనం లేదన్నారు. జగన్ లాంటి వారి గురించి రాజ్యాంగంలో ఎప్పుడో చెప్పారన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీని భ్రష్టుపట్టిస్తారని మండిపడ్డారు. దళిత ద్రోహి జగన్ అని ధ్వజమెత్తారు. ఆయనది చెత్త పరిపాలన అని ఎద్దేవా చేశారు. తనకు తోడుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని.. తమకు ఇద్దరికీ తోడుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారని తెలిపారు.
TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి
తాము ఏపీని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు. ఉత్తరాంధ్రకి సీఎం జగన్ ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. జగన్ విలాస పురుషుడు..భారీ భవంతి కట్టుకున్నారని సెటైర్లు గుప్పించారు. పేదలకు అగ్గిపెట్టె అంత ఇల్లు కట్టారని మండిపడ్డారు. ఈ దుర్మార్గుడు అన్ని కంపెనీలను తరిమేశాడన్నారు. విశాఖను గంజాయికు క్యాపిటల్‌గా మార్చారని.. ఇక్కడ భూములు దోచేశారని ఆరోపించారు. కరెంట్ చార్జీలు పెంచారని ఫైర్ అయ్యారు. విశాఖలో నాసిరకం మద్యం తెచ్చి, రేటు పెంచి పేదల రక్తం జలగలా తాగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కుంభకోణాలు చేసే వారిని ఉక్కుపాదంతో అణచి వేస్తానని మందలించారు. జగన్ రూ. 10 ఇచ్చి, రూ.100 కొట్టేస్తారని విమర్శించారు. తాను ఏపీ కోసం అప్పు తీసుకురానని. సంపద సృష్టిస్తా..మీకే పంచుతానని అన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
TDP: జగన్ ఓడి.. చంద్రబాబు సీఎం అవుతారు: రఘురామ
మరిన్ని ఏపీ వార్తల కోసం...