Kanipakam: వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:29 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు వరసిద్ధుడి ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.
ఐరాల(కాణిపాకం), నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామి దర్శనార్థం వేలాదిగా భక్తులు వరసిద్ధుడి ఆలయానికి విచ్చేయడంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.
రేపటినుంచి పవిత్రోత్సవాలు
వరసిద్ధుడి ఆలయంలో మంగళవారం నుంచి గురువారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో గురుప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉభయదారులు, భక్తులు, పరిసర గ్రామస్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఈవో కోరారు. కాగా, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాక ఆలయంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.