Share News

CM Chandrababu: శ్రీసిటీకి సీఎం చంద్రబాబు.. ఏం చేయబోతున్నారు..!?

ABN , Publish Date - Aug 18 , 2024 | 07:17 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఈనెల 19(సోమవారం)న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీసిటీ(Sri City)లో పలు కంపెనీల భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.

CM Chandrababu: శ్రీసిటీకి సీఎం చంద్రబాబు.. ఏం చేయబోతున్నారు..!?
CM Chandrababu Naidu

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఈనెల 19(సోమవారం)న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీసిటీ(Sri City)లో పలు కంపెనీల భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సోమవారం రోజున ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10గంటలకు తిరుపతికి బయలుదేరుతారు. ఉదయం 11:30గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ్నుంచి హెలికాఫ్టర్ ద్వారా శ్రీసిటీకి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు.


శ్రీసిటీలో ముందుగా 15సంస్థల కార్యకలాపాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే మరో ఏడు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. మెుత్తం రూ.900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో రూ.1,213కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో అక్కడే ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. శ్రీసిటీ పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలో సోమశిల సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రానికి ఉండవల్లి చేరుకుంటారు.


సీఎం పర్యటన సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంజామల వేంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ వారు శ్రీసిటీలో పర్యటించారు. హెలిపాడ్‌ సహా బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Andhra Pradesh: మట్టినీ వదలని వైసీపీ నేతలు..

Nimmala Rama Naidu: జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Aug 18 , 2024 | 08:03 PM