-
-
Home » Andhra Pradesh » Chittoor » Nara Chandrababu Naidu Palamaneru Prajagalam Live Updates in ABN Andhrajyothy, Telugu News, Siva
-
Palamaneru Prajagalam: సైకో జగన్ సర్వనాశంన చేశాడు..
ABN , First Publish Date - Mar 27 , 2024 | 12:21 PM
Palamaneru Prajagalam Live Updates: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పలమనేరు (Palamaneru) నుంచి ప్రజాగళం (Prajagalam) కార్యక్రమంతో ఎన్నికల శంఖారావం (Election Shankharavam)కు పూరించారు. ప్రజాగళం పేరుతో తొలుత పలమనేరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు చంద్రబాబు. ఇక్కడ సభ ముగిసిన తరువాత..
Live News & Update
-
2024-03-27T12:56:02+05:30
జగన్‌ను అడుగడుగునా నిలదీయాలి.
జగన్‌కు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలి.
జగన్ రాయలసీమ ద్రోహి.
జగన్ ఇక్కడకు రావడానికి వీలు లేదని ప్రజలు చెప్పాలి.
జగన్ అడుగడుగునా నిలదీయాలి.
-
2024-03-27T12:53:26+05:30
నిన్ను ఇంటికి పంపేందుకు మేమూ ‘సిద్ధమే’..: చంద్రబాబు
జగన్ సిద్ధం అంటూ ప్రజలను బలవంతంగా తరలిస్తున్నాడు.
ఇప్పుడు మేమూ సిద్ధం అంటున్నాను.
జగన్‌ను ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే.
జగన్ ఓడించాలి.
-
2024-03-27T12:46:25+05:30
రాయలసీమను సస్యశ్యామలం చేసింది ఎన్టీఆర్
కరువు జిల్లాలను, కరుగు గడ్డను సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్.
హంద్రీనీవా, తెలుగుగంగ, నగిరి, గాలేరు ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభించారు.
రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చాం.
-
2024-03-27T12:45:26+05:30
సైకో జగన్ సర్వనాశనం చేశాడు..
మీ భవిష్యత్ చీకటిమయం చేసిన వ్యక్తులను గుర్తించండి.
రాష్ట్రాన్ని, ప్రజల భవిష్యత్ కాపాడాల్సిన అవసరం ఉంది.
సైకో జగన్ అన్ని రంగాలను సర్వనాశంన చేశాడు.
-
2024-03-27T12:24:00+05:30
పలమేరు చేరుకున్న చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలమనేరు చేరుకున్నారు.
సాయినగర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయిన చంద్రబాబు.
మరికాసేపట్లో ప్రజాగళం సభ ప్రాంగణానికి చేరుకోనున్న చంద్రబాబు.
పలమనేరు నుండి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం.
మధ్యాహ్నం పుత్తూరు, సాయంత్రం మదనపల్లెలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభలు.
-
2024-03-27T12:20:00+05:30
Palamaneru Prajagalam Live Updates: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పలమనేరు (Palamaneru) నుంచి ప్రజాగళం (Prajagalam) కార్యక్రమంతో ఎన్నికల శంఖారావం (Election Shankharavam)కు పూరించారు. ప్రజాగళం పేరుతో తొలుత పలమనేరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు చంద్రబాబు. ఇక్కడ సభ ముగిసిన తరువాత.. 2.30 గంటల నుంచి 4 గంటల వరకు నగరి నియోజకవర్గం పరిధిలోని పుత్తూరులో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు మదనపల్లెలో జరిగే ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
-
2024-03-27T01:18:13+05:30
అందుకే ఎన్డీయేలో చేరా: చంద్రబాబు
ఎన్డీయేలో మళ్లీ చేరడంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ, జనసేనతో పొత్తు అధికారం కోసం కాదు.
నేను చూడని అధికారం లేదు.
రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే ఎన్డీయేతో కలిసాను.
-
2024-03-27T01:11:29+05:30
102 ప్రాజెక్టులను జగన్ రద్దు చేశాడు: చంద్రబాబు
జగన్‌ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
రాయలసీమను రత్నాలసీమగా చేయాలని కలగన్నాను.
పులివెందులకు కూడా నీళ్లు తీసుకువచ్చా.
అనంతపురానికి నీళ్లు తీసుకువస్తే కియా మోటార్స్ వచ్చింది.
వైసీపీ పాలనలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు.
సంపదను సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
భూముల విలువ పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది.
సంపదను సృష్టిస్తాం.. అందులో కొంత సంక్షేమానికి వినియోగిస్తాం.
-
2024-03-27T01:10:16+05:30
చంద్రబాబు ఎన్నికల వరాల జల్లు
ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.
యువతకు నాది గ్యారెంటీ. ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
బీసీలకు రక్షణ చట్టాలు తీసుకొస్తాం.
బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తాం.
ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెరగవు.
నాణ్యతలేని మద్యాన్ని అరికడతాం.
100 రోజుల్లో జే బ్రాండ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ లేకుండా చేస్తాం.
-
2024-03-27T01:02:40+05:30
రాయలసీమను జగన్ ఎడారి చేశాడు: చంద్రబాబు
ఆనాడు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు.
ఆ ప్రాజెక్టులను నేను మరింత అభివృద్ధి చేశాను.
నీళ్లు వస్తే పరిశ్రమలు వస్తాయి. నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది.