Pawan Kalyan: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 08:05 PM
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంబంధింత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ప్రణాళిక బద్దంగా తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంబంధింత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ప్రణాళిక బద్దంగా తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైస్సాఆర్ కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్ర చందనం డంప్, కేసు వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌కు అధికారులు అందించారు. దూదేకుల బాషా, మహ్మద్ రఫీ, అరవోల్ల రఫీ, చెల్లుబోయిన శివ సాయిలను పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. స్మగ్లర్లను నడిపిస్తున్న వాళ్లను పట్టుకోలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. శేషాచలంలో కొట్టేసిన దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలని ఆదేశించారు.
జిల్లాలు, రాష్ట్రాలు సంపద దాటిపోతోందని, నిఘా వ్యవస్థలు పటిష్టపరచాలని అటవీ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాలు దాటించి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని ఆదేశించారు. రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలని అన్నారు. శేషాచలం అడవుల్లో భారీగా ఎర్ర చందనం వృక్షాలను నరికేశారని చెప్పారు. ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించాలని అన్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల నెట్ వర్క ను నడిపిస్తున్న కింగ్ పిన్స్‌ను పట్టుకోవాలని ఆదేశించారు. కింగ్ పిన్స్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసులు పకడ్బందీగా నమోదు చేయాలని చెప్పారు. ఎన్ని కేసుల్లో శిక్షలుపడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన ఎర్ర చందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.