Anam Venkataramana Reddy: టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్
ABN , Publish Date - May 30 , 2024 | 12:26 PM
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధరారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు.
నెల్లూరు: ఎన్నికల ఫలితాల్లో టీడీపీ (TDP) విజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధరారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు. ఢిల్లీలో ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. దొంగ సంతకాలతో సర్టిఫికెటట్లు ఇచ్చిన వ్యక్తి ధర్మారెడ్డి అని... అటువంటి వెధవలతో గోవిందుడి ఆలయం నడిపిస్తారా? అని ఆనం వివేకానందరెడ్డి మండి పడ్డారు.
AP ECET Results 2024: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండి..
‘‘రమణదీక్షితులు పింక్ డైమండ్‌ని దొంగలెత్తుకెళ్లారని చెప్పాడు. పొట్టోడు విజయసాయి.. పింక్ డైమండ్ చంద్రబాబు బెడ్ రూంలో ఉందన్నాడు. ధర్మారెడ్డి... ఆ కోర్టు కేసు ఏమైంది. టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా? జగన్ ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నావా? స్వామి వారి డబ్బు రూ.2కోట్లు కట్టి కేసు వేస్తే.. నీరుగారుస్తావా? శ్రీవాణి ట్రస్టుకి సంబంధిచిన రూ.2వేల కోట్లు ప్రైవేటు బ్యాంకుల్లో ఎలా పెడతావ్? గోవిందుడికి పంగనామాలు పెట్టారు. ధర్మారెడ్డి కటాకటాల వెనక్కి పోవడం ఖాయం. ఢిల్లీకే కాదు, లండన్ కి వెళ్లినా విడిచిపెట్టం. చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి 6 నెలల్లో 4 బోర్టు మీటింగులు పెట్టాడు. అంతక ముందు బోర్డు మీటింగ్‌లు లైవ్ పెట్టేవారు. ఈ నాలుగు బోర్డు మీటింగులు ఎందుకు లైవ్ ఇవ్వలేదు. అజెండాలు బయటకి రానివ్వలేదు. రూ.వేల కోట్ల పనుల్లో 4 శాతం వాటాల కోసమే బోర్డు మీటింగులు పెట్టారు.
NEET: నీట్ ఆన్సర్ కీ విడుదల.. కటాఫ్ మార్కులు ఎంతంటే
మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.100కోట్ల దర్శన టిక్కెట్లు అమ్ముకున్నారు. ఒక్క ప్రోటోకాల్ టిక్కెట్టు రూ.లక్ష చొప్పున అమ్ముకున్నారు. రేయ్... ధర్మా... విశాఖ శారదా పీఠానికి భూమి ఇచ్చేస్తావా? ఎవరబ్బ సొమ్ము? టీటీడీ మొత్తం అవినీతిమయం. స్వామి వారి హుండీ... వైసీపీ పార్టీ, జగన్ హుండీగా మారిపోయింది. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే.. ఎమ్మెల్యేల లెటర్లు, ప్రోటోకాల్ దర్శనాలు ఎలా ఇస్తారు? నాలుగు రోజులు నుంచి మళ్లీ దండకాలు మొదలెట్టారు. వైఎస్ మొట్టమొదటి సారి నాన్ ఐఏఎస్ అధికారిని పెట్టాడు. జగన్ మళ్లీ నాన్ ఐఏఎస్ ని నియమించాడు. హుండీ కొల్లగొట్టేందుకే... నాన్ ఐఏఎస్‌లని పెట్టారు. ఐఏఎస్‌లు ఎందుకు మౌనంగా ఉన్నారు.. జగన్‌ని చూస్తే భయమా? మీరు ప్రశ్నించి ఉంటే, టీటీడీలో ఈ పరిస్థితి ఉండేది కాదు. టీడీపీ అధికారంలోకి రాగానే... టీటీడీ దేవస్థానాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చిన వారందరిపై విచారణ జరుగుతుంది. స్వామి సొమ్ము తిన్న ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి రాబోయే రోజుల్లో నరకం చూడక తప్పదు. డైరెక్ట్‌గా కర్రలు తీసుకుని తిరగబడమని సజ్జల చెప్పాడు. ఎన్నికల అధికారులు కౌంటింగ్ హాలులో పారా మిలటరీ సిబ్బందిని నియమించాలి. కర్రపట్టుకున్న వారిని కాల్చిపారేయాలి. పొన్నవోలుగా.. మేము నరికే బ్యాచ్ కాదురా... నరకం చూపే బ్యాచ్... తాగితే ఒళ్లు తెలియదారా... సారా తాగేవాడికి స్కాచ్ దొరికితే... లపాలపా తాగేయడమేనటరా?’’ అని ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Schools Closed: జూన్ 8 వరకు అన్ని స్కూల్స్ బంద్..కారణమిదే
Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.