Share News

AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:41 AM

Andhrapradesh: బీఆర్ అంబేదక్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెచ్‌డీఎస్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్‌ కుమార్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పటిలాగే తోటి సిబ్బందితో కలిసి దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రెండున్నర కోట్లు నగదు తీసుకొని ఏటీఎంలలో నగదు నింపేదుకు అశోక్ బయలుదేరాడు.

AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి
East Godavari

రాజమండ్రి, జూలై 27: అతడో బ్యాంకు ఉద్యోగి. మంచి ఉద్యోగం, సరైన జీతంతో ప్రశాంతంగా జీవనం సాగించాల్సిన ఆ ఉద్యోగికి ఏం దుర్భుద్ది పుట్టిందో కానీ... చేయకూడని పని చేసి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. జీతం ఇస్తున్న బ్యాంకుకే ఎగనామం పెట్టి భారీగా డబ్బును దోచుకుని పరారయ్యాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టిస్తే భారీ బహుమతి అంటూ ప్రకటనను విడుదల చేశారు.

Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై కఠిన చర్యలు


అసలేం జరిగిందంటే..

బీఆర్ అంబేదక్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెచ్‌డీఎస్‌సీలో (HDFC Bank)ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్‌ కుమార్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పటిలాగే తోటి సిబ్బందితో కలిసి దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రెండున్నర కోట్లు నగదు తీసుకొని ఏటీఎంలలో నగదు నింపేదుకు అశోక్ బయలుదేరాడు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 19 ఏటీఎంలలో రెండున్నర కోట్ల రూపాయలు ఫిల్లింగ్ చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యలోనే తోటి సిబ్బంది కళ్లుగప్పి నిందితుడు అశోక్ నగదుతో ఉడాయించాడు. విషయం తెలిసిన బ్యాంకు అధికారులు నిందితుడిపై రాజమండ్రి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అశోక్‌కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Andhra Pradesh Debits: ఏపీ.. అప్పులకుప్ప


అయితే నిందితుడిని పట్టిస్తే భారీగా బహుమతి ఇస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ప్రకటనను విడుదల చేశారు. ‘‘బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కు చెందిన నిందితుడు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. నిందితుడు వాసంశెట్టి అశోక్‌కుమార్ దానవాయిపేటలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.2,20,50,000/- చోరీ చేసి పరారయ్యాడు. నిందితుడు రాజమండ్రి నుంచి వైట్ కలర్ స్విఫ్ట్ డిజైర్ కారు AP 40 AT 5120 లో పరారయ్యాడు. కారును కొత్తపేట వద్ద వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు ఆచూకి తెలిపిన వారు రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ ఇన్స్పెక్టర్- 9440796574. రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డిఎస్పి 9490760792.కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి బహుమతి అందజేస్తాం’’ అని ఎస్పీ నరసింహ కిషోర్ ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

YS Jagan: జగన్‌ పత్రికకు జనం సొమ్ము

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2024 | 09:52 AM