Share News

Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పవన్ మూడో రోజు పర్యటన

ABN , Publish Date - Jul 03 , 2024 | 08:00 AM

కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడో రోజు పర్యటించనున్నారు. ఉదయం 10.45 కు ఉప్పాడ సముద్రపు కోతను పవన్ పరిశీలించనున్నారు. అనంతరం హార్బర సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పవన్ మూడో రోజు పర్యటన

కాకినాడ: కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడో రోజు పర్యటించనున్నారు. ఉదయం 10.45 కు ఉప్పాడ సముద్రపు కోతను పవన్ పరిశీలించనున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో వారాహి బహిరంగ సభ జరగనుంది. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు విజయవాడకు ప్రయాణం కానున్నారు.


రెండు రోజులుగా పవన్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న ఉదయం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ (Panchayati Raj), అటవీశాఖ (Forest Department), కాలుష్య నియంత్రణ (Pollution Control) శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సాయంత్రం గొల్లప్రోలులో నివాసానికి బయలుదేరి వెళ్లారు. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వివిధ శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యాయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై పవన్ చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అటవీశాఖ విస్తీర్ణత, అడవులను కాపాడుకునే అంశాలపై డిప్యూటీ సీఎం అధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలియవచ్చింది.

Updated Date - Jul 03 , 2024 | 08:00 AM