TS Politics: ఉండవల్లిని కలిసిన షర్మిల.. వీరి భేటీలో ఏం చర్చించారంటే..?
ABN , Publish Date - Jan 25 , 2024 | 07:14 PM
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ను ఆయన నివాసంలో గురువారం నాడు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) కలిశారు. వీరిద్దరూ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించారు.
రాజమండ్రి: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ను ఆయన నివాసంలో గురువారం నాడు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) కలిశారు. వీరిద్దరూ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ఉండవల్లిని కుటుంబ సాన్నిహిత్యంతోనే కలిశానని.. ఇందులో రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. వైఎస్సార్‌తో సన్నిహితంగా ఉన్న వాళ్లని తాను కలుస్తున్నానని షర్మిల తెలిపారు. అనంతరం ఉండవల్లి మాట్లాడుతూ... తన ఆశీస్సుల కోసం షర్మిల వచ్చారని చెప్పారు. షర్మిలకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.
షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని ధీమా వ్యక్తం చెప్పారు. రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని.. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో మాత్రమే పరిపాలన సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు. వైఎస్సార్‌లో ఉన్న నడవడిక షర్మిలకు కూడా వచ్చిందన్నారు. షర్మిలకు వైఎస్సార్ కుమార్తెగా గుర్తింపు ఉందని తెలిపారు. ఏడేళ్ల క్రితం తన వద్దకు జగన్ వచ్చారని.. వారిద్దరూ కుటుంబ కలహాలతో విడిపోవటం సహజమని.. రాజకీయాలు వేరని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.