Share News

Andhra Pradesh: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. తీవ్ర ఉద్రిక్తత..!

ABN , Publish Date - May 05 , 2024 | 04:54 PM

టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID Notice) అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ(CID) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ..

Andhra Pradesh: టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. తీవ్ర ఉద్రిక్తత..!
AP CID Issues Notice

అమరావతి, మే 05: టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID Notice) అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ(CID) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను తీసుకుని సోమవారం నాడు గుంటూరు(Guntur) సీఐడీ కార్యాలయానికి రావాలంటూ టీడీపీ ఆఫీసుకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఐడీకి కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు టీడీపీకి నోటీసులు జారీ చేశారు.


సీఐడీ అధికారులపై టీడీపీ నేతలు ఫైర్..

టీడీపీ కేంద్రకార్యాలయానికి సీఐడి అధికారులు రావడంపై ఆనం వెంటరమణారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. డిజీపీ వైఎస్ రాజేంధ్రనాధ్ రెడ్డి ఆదేశాలతో పరిగెత్తుకొనివచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు నోటీసులు ఇచ్చారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ఒక చెత్త యాక్టు తీసుకొస్తే దానిని ప్రశ్నించినందుకు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వలన ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు. 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. మరో నెల రోజుల్లో జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోతున్న సమయంలో ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారని జగన్‌ను ఆనం ప్రశ్నించారు. అవ్వతాతలకు పెన్షన్లు చంద్రబాబు వలనే అపివేశారని చెబుతున్న వైసీపీ నాయకుల మాటలు జవహార్ రెడ్డికి వినిపించలేదా? అని ప్రశ్నించారు.


వైసీపీ నాయకులు.. టీడీపీ నాయకుల మీద దుష్పచారం చేస్తే వారిపై కేసు నమోదు చేయరా? అని ఆనం ప్రశ్నించారు. రాత్రికిరాత్రే జగన్ తన ప్రచారాన్ని ఆపేసి టీడీపీ నాయకుల మీద కేసులు నమోదు చేయడానికి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చారని విమర్శించారు. ఆరు రోజుల్లో ఎలక్షన్స్ పెట్టుకొని చంద్రబాబు మీద కేసులు నమోదు చేయడానికి వచ్చాడని.. మరో నెల రోజుల్లో జగన్ వెల్లిపోతాడని.. ఇప్పటికైన సీఐడీ అధికారులు మారాలని హితవు చెప్పారు. ఎవరైనా పేపర్లో ఫోటోలు వేసుకున్నేవాళ్లను చూశాం కానీ.. సర్వే రాళ్ల మీద ఫోటోలు వేయించుకున్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని ఆనం విమర్శంచారు. పెన్షన్ కారణంగా చినిపోయిన అవ్వతాతల హత్య కేసులు అన్ని జవహార్ రెడ్డి మీదనే పెట్టాలని వ్యాఖ్యానించారు.

Fore More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 05 , 2024 | 05:05 PM