Share News

YSRCP: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:52 PM

Andhrapradesh: ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడపై వీకోట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ఎమ్మెల్యే ఫోటోలు ఉన్న ప్యాడ్లను విద్యార్థులకు అందించి వాటితో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఇదే అంశాన్ని సోమవారం పలమనేర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గమనించిన పరీక్షల పర్యవేక్షకులు పలమనేరు ఆర్డీవోకు నివేదిక అందించారు.

YSRCP: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

చిత్తూరు, మార్చి 19: ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటేగౌడపై (Palamaneru YSRCP MLA Venkatesh Goud) వీకోట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ఎమ్మెల్యే ఫోటోలు ఉన్న ప్యాడ్లను విద్యార్థులకు అందించి వాటితో విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయ్యింది. ఇదే అంశాన్ని సోమవారం పలమనేర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గమనించిన పరీక్షల పర్యవేక్షకులు పలమనేరు ఆర్డీవోకు నివేదిక అందించారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో స్పందించిన ఎన్నికల కమిషన్ చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు పలమనేరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో మనోజ్ రెడ్డి ఫిర్యాదు మేరకు వీకోట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 75 / 2024 గా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

Samsung: రూ.18 వేలకే Galaxy A35 5జీ స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ తెలుసా?


ఈరోజు కూడా వీకోట బాలిక బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం వద్ద ఎమ్మెల్యే చిత్రాలు ఉన్న ప్యాడ్లను అనుమతించాలంటూ పోలీసులు, డిప్యూటీ తాసిల్దార్ ఇతర రెవెన్యూ అధికారులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ అధికార పక్షం లెక్కచేయని పరిస్థితి. పరీక్ష కేంద్రం ముందు విద్యార్థులకు అసౌకర్యం కల్పిస్తూ అధికారులతో వైసీపీ వర్గీయులు దురుసుగా ప్రవర్తించారు. ఇదే విషయంపై ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో పలమనేరు నియోజకవర్గంలోని ఎంఈఓలతో పాటు హెచ్ఎంలతో ప్రత్యేక వైర్లెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం తమకేమీ తెలియదు అన్నట్లు పరీక్ష కేంద్రాల వద్ద హడావిడి చేస్తున్న వైసీపీ నేతలను వారించకుండా వదిలేయడం చర్చినీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి..

KA Paul: నన్ను ఎంపీగా గెలిపిస్తే దేశాన్ని కాపాడుతా

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 19 , 2024 | 04:54 PM