Chandrababu: వైసీపీ అక్రమాలను అణిచేద్దాం... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
ABN , Publish Date - Apr 22 , 2024 | 05:21 PM
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) నాయకుల అక్రమాలు పెరిగిపోతున్నాయని వీటిని అణిచేద్దామని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మాఫియాను ఏపీ నుంచి తరిమేద్దామని హెచ్చరించారు.
కాకినాడ: ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) నాయకుల అక్రమాలు పెరిగిపోతున్నాయని వీటిని అణిచేద్దామని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మాఫియాను ఏపీ నుంచి తరిమేద్దామని హెచ్చరించారు. జగ్గంపేటలో జరుగుతున్న ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bride Kidnap: షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..
తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే ..
కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఏపీని పూర్తిగా విధ్వంసం చేశారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. మద్య నిషేదం చేశాకే ఓటు అడుగుతా అన్నారు.. చేశారా? అని నిలదీశారు. సీపీఎస్ రద్దు చేస్తా అన్నారు.. చేశారా?అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్.. మెగా డీఎస్సీ అన్నారు.. వేశారా? అని అడిగారు. టీడీపీ హయాంలో కరెంట్ చార్జీలు పెరగలేదని చెప్పుకొచ్చారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే ఉంటుందని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో తయారు చేశామని స్పష్టం చేశారు. మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మాటిచ్చారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రైతును రాజుగా చేసే బాధ్యత తమదని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చంద్రబాబు అన్నారు.
Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ
కోవూరి లక్ష్మి ఘటనపై స్పందించిన చంద్రబాబు
కోవూరి లక్ష్మి ఘటనపై చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలనను దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు గుంటూరుకు చెందిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి లక్ష్మి తన వేలిని కోసుకున్నారన్న వార్త తనను కలచివేసిందని అన్నారు. తమ ప్రాంతంలోని అక్రమాలను గురించి ఆమె ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి ఉంటే నేడు ఇంత దారుణం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజల నిస్సహాయస్థితికి ఇది నిదర్శనమని చెప్పుకొచ్చారు.
‘‘ప్రజలారా! మీ వేళ్లు కోసుకోవడం కాదు.. ఈ దుర్మార్గపు పాలనను ఏపీ నుంచి తరిమికొట్టాలి. ఈ ఎన్నికల్లో అదే వేలితో బటన్ నొక్కి, మీ ఓటు అనే ఆయుధంతో జగన్ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి. అంతేగాని నిర్వేదంతో, నిస్పృహతో ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దు. ఇవి సమస్యలకు పరిష్కారం చూపవు’’ అని చంద్రబాబు అన్నారు.
Nellore: భిన్నవ్యక్తిత్వాల మధ్య పోరు.. ఎవరిదో జోరు!
Read Latest Election News or Telugu News