Chandrababu: పల్నాడులో హింసపై చంద్రబాబు సీరియస్..
ABN , Publish Date - May 13 , 2024 | 12:59 PM
పల్నాడులో హింస పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల లో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని టీడీపీ చెబుతోంది. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా... శాంతి భద్రతలు కాపాడలేకపోయారని చంద్రబాబు విమర్శించారు
అమరావతి: పల్నాడులో హింస పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల లో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని టీడీపీ చెబుతోంది. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా... శాంతి భద్రతలు కాపాడలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. ఈసీ వెంటనే ఈ ప్రాంతంలో పోలింగ్‌పై సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబు కోరారు.
AP Electiosn 2024: పెరుగుతున్న ఓటింగ్ శాతం.. కూటమి నేతల్లో జోష్..
ఏపీలో ఎక్కడ పడితే అక్కడ వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ తరుపున ఏజెంట్ ఫామ్ ఇవ్వడానికి వెళ్లిన సుబ్బయ్యపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుబ్బయ్యను వెంటనే నరసరావుపేట ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అలాగే అటు మాచర్ల నియోజకవర్గంలోనూ వైసీపీ దౌర్జన్యానికి దిగింది. రెంటచింతలలో టీడీపీ ఏజెంట్లు దాడికి పాల్పడ్డారు. నలుగురు టీడీపీ ఏజెంట్లకు తలలు పగిలాయి. ఏజెంట్లుగా టీడీపీ వాళ్లకు ఉండటానికి వీలేద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
Hindupur: హిందూపూర్ ఎంపీ సీటు కోసం ఎవరెవరు బరిలో ఉన్నారంటే
Pawan Kalyan: ఓటు వేసిన పవన్ కల్యాణ్..ఎక్కడంటే
Read Latest AP News And Telugu News