Share News

Elections 2024: ప్రజాస్వామ్యం అంటే ఇదేరా.. సెలబ్రేటీల మొదలు సాధారణ మనిషి వరకు ఒకటే రూల్..

ABN , Publish Date - May 13 , 2024 | 12:55 PM

ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పెండుగ. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకుంటారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు భారత్‌కు ఎంతో ప్రత్యేకం. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎలాంటి వ్యక్తి అయినా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వెయ్యాలి. వయో వృద్ధులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మాత్రం ముందుగానే పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేయ్యొచ్చు.

Elections 2024: ప్రజాస్వామ్యం అంటే ఇదేరా.. సెలబ్రేటీల మొదలు సాధారణ మనిషి వరకు ఒకటే రూల్..
Voters

ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పెండుగ. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకుంటారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు భారత్‌కు ఎంతో ప్రత్యేకం. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎలాంటి వ్యక్తి అయినా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వెయ్యాలి. వయో వృద్ధులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మాత్రం ముందుగానే పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేయ్యొచ్చు. మిగతా ఓటర్లంతా తమ హోదాలతో సంబంధం లేకుండా పోలింగ్ బూత్‌లకు వెళ్లి క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఓటు వేసే విషయంలో ఎవరికి ప్రత్యేక హక్కులు ఏమి ఉండవు. ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. క్యూలో నిలబడలేని వ్యక్తులకు మాత్రం మానవీయకోణంలో కొంత మినహాయింపు ఉంటుంది. అది తప్ప ఇక ఎవరైనా పోలింగ్ బూత్‌ వద్ద క్యూలో ఉండి ఓటు వేయాల్సిందే. ప్రస్తుతం ఏపీ, తెలంగాణతో పాటు దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో నాలుగో దశ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో సెలబ్రేటీలు సైతం క్యూలో ఉండి ఓటు వేస్తున్నారు.

AP Elections: ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి కేశినేని చిన్ని.. కానీ


సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకు..

సమాజంలో సెలబ్రెటీలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వారు ఎక్కడికైనా వెళ్తే పూర్తి భద్రత ఉంటుంది. వారి సమీపంలోకి ఎవరైనా వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి. కానీ పోలింగ్ సందర్భంగా చూస్తే ఈ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. పోలింగ్ కేంద్రంలోకి ఒక ఓటరు మాత్రమే వెళ్లాలి. వారి భద్రత సిబ్బందిని అనుమతించరు. సెలబ్రేటీ అయినా సామాన్యుడికి అయినా పోలింగ్ బూత్‌లో ఒకటే నిబంధన. ఓటు వేయడానికి ఎవరైనా అప్పటికే క్యూలో ఉంటే లైన్‌లో నిల్చుని ఓటు వేసి రావాలి. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సైతం ఓటర్లందరినీ సమానంగా చూడాల్సి ఉంటుంది. చూస్తారు కూడా. ప్రధాని, ముఖ్యమంత్రి మొదలు ఓ సాధారణ ఓటరు వెళ్లినా ఎన్నికల సిబ్బంది ఒకేలా వ్యవహరిస్తారు. సెలబ్రేటీలు వచ్చారని అత్యుత్సాహం ప్రదర్శించరు. ఎంత పెద్ద సెలబ్రెటీ అయినా పోలింగ్ బూత్‌లో ఎన్నికల సిబ్బందితో సిరా చుక్క వేలికి వేయించుకోవల్సిందే. సమాజంలో వారు సెలబ్రేటీ కావొచ్చు. కానీ భారత ప్రజాస్వామ్య పండుగలో మాత్రం వారు కూడా కామన్ మ్యాన్‌నే.


ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఓటు వేశారు. హైదరాబాద్‌లో సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీళ్లంతా క్యూలైన్లో నిల్చుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


AP Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 12:55 PM