AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడుతున్న కౌన్సిలర్లు
ABN , Publish Date - Mar 22 , 2024 | 12:40 PM
Andhrapradesh: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని పార్టీలు ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. మరోసారి గెలుపు మాదే అని వైసీపీ, ఈసారి తప్పకుండా గెలుస్తామని టీడీపీ ఎవరి వారు ధీమాగా ఉన్నారు. అయితే ఈ సమయంలో పలువురు నేతలు పెద్దఎత్తున వైసీపీని వీడటం అధిష్టానాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా, మార్చి 22: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని పార్టీలు ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి. మరోసారి గెలుపు మాదే అని వైసీపీ (YSRCP), ఈసారి తప్పకుండా గెలుస్తామని టీడీపీ (TDP)ఎవరి వారు ధీమాగా ఉన్నారు. అయితే ఈ సమయంలో పలువురు నేతలు పెద్దఎత్తున వైసీపీని వీడటం అధిష్టానాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వైసీపీపై అసంతృతితో ఉన్న పలువురు నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పేస్తూ టీడీపీలోకి చేరిపోతున్నారు. నందిగామలో ఇటీవల కొంత మంది మునిసపల్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో కౌన్సిలర్ కూడా వైసీపీకి టాటా చెప్పేశారు.
BJP: సౌత్ చెన్నైలో తమిళిసై.. కోవైలో అన్నామలై.. 9మందితో బీజేపీ తొలి జాబితా
నందిగామ 9వ వార్డుకు చెందిన కౌన్సిలర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కౌన్సిలర్‌తో పాటు మరికొంత మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. శుక్రవారం విజయవాడలో టీడీపీ నేతలు కేశినేని శివనాథ్ చిన్ని , తంగిరాల స్వౌమ్య ఆధ్వర్యంలో కౌన్సిలర్ టీడీపీలో చేరారు. టీడీపీ నేతలు.. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొన్ని రోజుల క్రితం ఇద్దురు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా కౌన్సిలర్లు పార్టీని వీడటం వైసీపీలో తీవ్ర కలవరం రేపుతోంది.
ఇవి కూడా చదవండి..
MLA Vasantha Krishna Prasad: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా..
AAP Ministers Detained: పోలీసుల అదుపులో ఢిల్లీ ఆప్ మంత్రులు.. కాంగ్రెస్ రియాక్ట్
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...