AP Elections: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు...
ABN , Publish Date - May 10 , 2024 | 03:02 PM
Andhrapradesh: ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అలాగే పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సహజంగా పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఏజెంట్లు గుర్తించిన తర్వాతే వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తారు పోలింగ్ సిబ్బంది.
అమరావతి, మే 10: ఏపీలో (Andhrapradesh) మరో మూడు రోజుల్లో ఎన్నికలు (AP Elections 2024) జరుగనున్నాయి. ఇందుకు కోసం ఈసీ (Election Commission) అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అలాగే పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సహజంగా పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఏజెంట్లు గుర్తించిన తర్వాతే వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తారు పోలింగ్ సిబ్బంది. ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో అభ్యర్థుల తరపున ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది.
AP Elections: కొడాలి నాని అడ్డాలో కుమారీ ఆంటీ..!
పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి నేరుగా విధులకు హాజరు కావచ్చని ఆదేశాలు జారీ చేసింది. గతంలో చేసినట్లు ఏజెంట్లకు పోలీసు, రిటర్నింగ్ అధికారి వెరిఫేకషన్, ఆమోదం అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలింగ్ ఏజెంట్ల విషయంలో అధికార దుర్వినియోగం జరగకుండా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. పోలీసు కేసులు ఉన్నా ఏజెంట్‌లుగా పనిచేయవచ్చని పేర్కొంది. ఏజెంట్ల నియామకం విషయంలో పోలీసులు అభ్యంతరాలు తెలిపే అధికారం లేదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
Chandrababu: పచ్చి మోసగాడు ఈ జలగ.. రంగుల పిచ్చోడు ఇళ్లు కట్టించాడా?
Lok Sabha Elections: నవనీత్ కౌర్‌పై కేసు నమోదు
Read Latest AP News And Telugu News