Share News

CEC: డీబీటీ పథకాలకు నిధుల విడుదలపై సీఈసీ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పాలంటూ..

ABN , Publish Date - May 10 , 2024 | 01:31 PM

Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండి లేఖ రాసింది. నిధుల విడుదలలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ సీఎస్‌కు లేఖ రాసింది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డీబీటీ పథకాల అమలవుతున్నాయా? అని ప్రశ్నించింది. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు పథకాలకు నిధులు ఇవ్వలేని ప్రభుత్వం పరిస్థితి ఒక్కసారిగా ఎలా మారిందని..

CEC: డీబీటీ పథకాలకు నిధుల విడుదలపై సీఈసీ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పాలంటూ..
CET Letter to AP CS Jawahar Reddy

అమరావతి, మే 10: సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై (welfare schemes Funds Release) ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి (AP CS Jawahar Reddy) ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Central Election Commission) లేఖ రాసింది. నిధుల విడుదలలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ సీఎస్‌కు లేఖ రాసింది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డీబీటీ పథకాల అమలవుతున్నాయా? అని ప్రశ్నించింది. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు పథకాలకు నిధులు ఇవ్వలేని ప్రభుత్వం పరిస్థితి ఒక్కసారిగా ఎలా మారిందని.. ఇప్పుడు నిధులు ఎలా సర్దుబాటు అయ్యాయని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ (AP Elections 2024) తేదీకి దగ్గరగా డబ్బులు పంపిణీ కాదని ఎలా చెపుతారని నిలదీసింది.

YS Viveka Case: ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సునీత


ఇలా సొమ్ములు పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరగదా? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతినదా? అని ప్రశ్నించింది. గత ఐదేళ్లగా సంక్షేమ పథకాల నిధులకు బటన్ నొక్కిన నాటి నుంచి ఎన్ని రోజుల్లో పడ్డాయి ఆ వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు మాత్రమే ఎందుకు ఆలస్యమైందని.. పోలింగ్ తేదీకి దగ్గరగా ఈ సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈరోజే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే జరిగే ప్రమాదం ఏంటి వెంటనే తెలపాలని కోరింది.

TS News: మా నాన్నని బతికించండి..


సంక్షేమ పథకాలు నిధులు ఇస్తామని చెప్పి వారాలు, నెలలు గడిచిపోయాయని.. ఏప్రిల్, మే నెలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని ముందుగా తెలియదా అని సీఈసీ ప్రశ్నించింది. పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు అంత తొందర ఏమి వచ్చింది సమాధానం ఇవ్వాలని తెలిపింది. ముందుగానే పంపిణీ తేదీని నిర్ణయించి ఉంటే ఆ వివరాలను కూడా డాక్యుమెంట్ రూపంలో అందించాలని తెలియజేసింది. ఈ క్లారిఫికేషన్లన్నీ ఈ సాయంత్రం మూడు గంటలకు అందించాలని సీఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రెటరీ అవినాష్ కుమార్ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి..

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్‌డేట్

Chennai: అనారోగ్యంతో భార్య మృతి.. గుడి కట్టి ఆరాధిస్తున్న భర్త

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 01:33 PM