Sajjala Ramakrishna: ఈనెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
ABN , Publish Date - Mar 19 , 2024 | 04:25 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27 నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సిద్దం పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల సభలు నిర్వహించామన్నారు. సీఎం జగన్ 20 ఏళ్ల పాటు జరగని అభివృద్దిని చేశారన్నారు. మ్యానిఫెస్టోలో 99శాతం హమీలు నెరవేర్చేశామని చెప్పుకొచ్చారు.
అమరావతి, మార్చి 19: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) ఈనెల 27 నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సిద్దం పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల సభలు నిర్వహించామన్నారు. సీఎం జగన్ 20 ఏళ్ల పాటు జరగని అభివృద్దిని చేశారన్నారు. మ్యానిఫెస్టోలో 99శాతం హమీలు నెరవేర్చేశామని చెప్పుకొచ్చారు. సిద్ధం సభలతో జాతీయ స్ధాయిలో అందరి దృష్టి రాష్ట్రంపై పడిందన్నారు. దానికి కొనసాగింపుగా ‘‘మేము సిధ్దం మా బూత్ సిద్ధం’’ అని కార్యకర్తలు ప్రకటించారని తెలిపారు. దీనికి కొనసాగింపుగానే ఈనెల 27 నుంచి సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తారని ప్రకటించారు.
Kavitha: రెండ్రోజులే టైమ్.. టెన్షన్‌లో కవిత!
సిద్ధం సభలు జరిగిన పార్లమెంటు నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి బస్సుయాత్ర అంటే ఏప్రిల్ 18 నాటికి బస్సుయాత్ర ముగుస్తుందన్నారు. సీఎం బస్సుయాత్ర జరిగినంత కాలం పండుగలకు, సెలవులలో కూడా అక్కడే ఉంటారన్నారు. 27 ఉదయం ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళి చేసి యాత్రకు బయలుదేరుతారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే
Delhi liquor Scam: ‘మా అమ్మను కలిసేందుకు అనుమతించండి’... కోర్టుకు కవిత అభ్యర్థన
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...