Elections 2024: పోలింగ్‌లో టాప్ ఆ నియోజకవర్గాలే.. విజయం వరించేది ఎవరినంటే..
ABN , Publish Date - May 14 , 2024 | 04:29 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 79.04 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈ పోలింగ్ శాతం ఒకటి నుంచి రెండు శాతం మధ్యలో పెరిగే అవకాశం ఉండొచ్చు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గంలో 88.61 శాతం పోలింగ్ నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 79.04 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈ పోలింగ్ శాతం ఒకటి నుంచి రెండు శాతం మధ్యలో పెరిగే అవకాశం ఉండొచ్చు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం (Election Comission) వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గంలో 88.61 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 87.58శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే 1.03 శాతం పోలింగ్ ఎక్కువుగా నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో పెరిగిన పోలింగ్ శాతాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే చూడాల్సి ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..
మొదటి పది నియోజకవర్గాలు ఇవే..
రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైన నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం. 2019లో 87.58 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈ ఎన్నికల్లో 88.61 శాతం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి తరపున బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పోటీచేస్తున్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోటీచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉంటాయి. బీజేపీ నుంచి బీసీ అభ్యర్థి పోటీ చేయడంతో ఆ వర్గానికి చెందిన ఓట్లు పోలరైజ్ అయి పోలింగ్ శాతం పెరిగిఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గంలో 87.75 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైన నియోజకవర్గం ఉంగుటూరు. గత ఎన్నికలతో పోలిస్తే 0.92 శాతం పోలింగ్ ఎక్కువుగా నమోదైంది. ఏపీలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైన మూడో నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెడన. ఇక్కడ 87.72 శాతం పోలింగ్ నమోదైంది. 2019తో పోలిస్తే 0.02శాతం తగ్గింది. గత ఎన్నికల్లో 86.49 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధిక పోలింగ్ నమోదైన నాలుగో నియోజకవర్గం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ.. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 86.49 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈ ఎన్నికల్లో 87.67 శాతం నమోదైంది. గతంతో పోలిస్తే 1.18 శాతం పోలింగ్ అధికంగా నమోదైంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం అత్యధిక పోలింగ్ నమోదైన ఐదో జిల్లాగా నిలిచింది. ఈ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే 0.21 శాతం పోలింగ్ తగ్గింది. 2019లో 87.71 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈ ఎన్నికల్లో 87.50 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైన ఆరో నియోజకవర్గం మండపేట. 2019లో ఇక్కడ 86.96 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈ ఎన్నికల్లో 87.50 శాతం నమోదైంది. అంటే గతంతో పోల్చినప్పుడు 0.54 శాతం అధికంగా నమోదైంది.
ఏపీలో ఎక్కువ పోలింగ్ నమోదైన ఏడో జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల. 2019లో ఈ నియోజకవర్గంలో 84.19 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈ ఎన్నికల్లో 87శాతం నమోదైంది. గతంలో పోలిస్తే 2.81 శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. ఇక అత్యధిక పోలింగ్ శాతం నమోదైన ఎనిమిదో నియోజకవర్గం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నూజివీడు. ఇక్కడ 2019 ఎన్నికల్లో 86.93 శాతం నమోదైతే ఈ ఎన్నికల్లో 87.32 శాతం నమోదైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో 86.75 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైన 9వ నియోజకవర్గంగా అద్దంకి నిలిచింది. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 89.45 శాతం నమోదుకాగా.. గతంతో పోలిస్తే 2.7 శాతం పోలింగ్ తగ్గింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామలో 86.50 శాతం పోలింగ్ నమోదుకాగా.. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 87.4 శాతం నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 0.9 శాతం పోలింగ్ తగ్గింది.
ఈ పదిలో గతంలో ఎవరంటే..
పోలింగ్ అత్యధికంగా నమోదైన మొదటి పది నియోజకవర్గాల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019లో ఈ పది నియోజకవర్గాలకు గానూ ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలవగా.. మూడు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ ఎన్నికల్లో పది నియోజకవర్గాలకు గానూ 7 నుంచి 8 చోట్ల ఎన్డీయే అభ్యర్థులు అధిక్యాన్ని కనబర్చే అవకాశం ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. వైసీపీ రెండు నుంచి మూడు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
AP Elections 2024: సీఎం జగన్ కుట్రను భగ్నం చేసిన ఎన్నికల కమిషన్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News And Telugu News