Share News

Nara Lokesh: అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన వేల కోట్లా?

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:10 AM

ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులూ.. రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఒక్కసారైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా? అని ప్రశ్నించారు. మీ ఎదురుగా సీఎం జగన్ ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్‌ను తనిఖీ ఎందుకు చేయలేదని నారా లోకేష్ ప్రశ్నించారు.

Nara Lokesh: అందులో ఏముంది? బ్రెజిల్ సరుకా? లిక్కర్లో మెక్కిన వేల కోట్లా?

అమరావతి: ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసులూ.. రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. ఒక్కసారైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా? అని ప్రశ్నించారు. మీ ఎదురుగా సీఎం జగన్ (CM Jagan) ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్‌ను తనిఖీ ఎందుకు చేయలేదని నారా లోకేష్ ప్రశ్నించారు. ‘అందులో ఏముంది? బ్రెజిల్ (Brezil) సరుకా? లిక్కర్లో మెక్కిన వేల కోట్లా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్ (AP Secretariat) ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? సమాధానం డీజీపీ చెబుతారా?’ అని నారా లోకేష్ నిలదీశారు.

Ram Charan: రామ్ చరణ్ కూతురు క్లీంకార ఫేస్ రివీల్.. ఎంత క్యూట్‌గా ఉందో..

అంతకు ముందు ఓ ట్వీట్‌లో.. ఇంటికి కిలో బంగారమిచ్చినా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఓటమి తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం... జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలని నిర్ణయానికొచ్చారన్నారు. ఈ నేపథ్యంలో చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) చెందిన గోడౌన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు పట్టుకున్నారని నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్‌నైతే పట్టుకున్నారన్నారు. మరి ఇసుక, లిక్కర్‌లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్‌‌ను ఎప్పుడు పట్టుకుంటారని లోకేష్ ప్రశ్నించారు.

AP Elections: పిఠాపురంలో గెలిచేదెవరు.. ప‌వ‌న్ కు ల‌క్ష మెజార్టీ వ‌స్తుందా..?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 27 , 2024 | 11:59 AM