AP Elections 2024: పోలవరం పనులు అందుకే ఆగిపోయాయి: నితిన్ గడ్కరీ
ABN , Publish Date - May 02 , 2024 | 10:46 PM
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు.వేపగుంటా మీనాక్షి కన్వేషన్స్‌లో కూటమి ఆద్వర్యంలో ఎలైట్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నితిన్ గడ్కరీ. అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు..కూటమి పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు.
విశాఖపట్నం: ఏపీలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు.వేపగుంటా మీనాక్షి కన్వేషన్స్‌లో కూటమి ఆద్వర్యంలో ఎలైట్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నితిన్ గడ్కరీ. అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు..కూటమి పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు.
Lok Sabha Elections 2024: కేసీఆర్ కుటుంబ సభ్యులను ఆ మంత్రి కాపాడుతున్నారు: బండి సంజయ్
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పోలవరం ప్రాజెక్టును మంజూరు చేశానని వివరించారు. 1300 టీఎంసీ నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జల వనరుల కొరత లేదని.. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.అవినీతి, దూరదృష్టి లేని ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు అవసరమే కానీ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని తెలిపారు. గ్రామీణ రైతులను బలోపేతం చేస్తే సంక్షేమ పథకాలు పెద్దగా అవసరం ఉండదన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని నితిన్ గడ్కరీ కోరారు.
Father: తండ్రి కాదు కసాయి.. ఆరేళ్ల బాలుడిని ఏం చేశాడో తెలుసా..?
రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయి: సీఎం రమేష్
అనకాపల్లి పార్లమెంట్‌ను మోడల్ పార్లమెంట్‌గా అభివృద్ధి చేస్తానని అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తెలిపారు.నితిన్ గడ్కరీ డైనమిక్ మినిష్టర్ అని చెప్పారు. భారతదేశంలో రోడ్లు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే కారణం నితిన్ గడ్కరీనే కారణమని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల తప్పితే మిగిలిన రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉందని సీఎం రమేష్ పేర్కొన్నారు.
సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారు: రమేష్ బాబు
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తామే ఇస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు అన్నారు. కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ ఏపీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆయన రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శమని చెప్పారు. మేధావులు ఆలోచించి త్వరలో జగరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించాలని రమేష్ బాబు కోరారు.
AP Govt: ఎన్నికల వేళ ఉద్యోగులకు ఏపీ సర్కార్ దిమ్మతిరిగే షాక్!
Read latest AP News And Telugu News