AP Elections 2024: తిరుపతిలో సిట్ అధికారులు.. పులివర్తి నాని దాడి పై క్లారిటీ..!
ABN , Publish Date - May 19 , 2024 | 06:20 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) ముగిసిన అనంతరం జరిగిన అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చెలరేగిన హింసపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
తిరుపతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) ముగిసిన అనంతరం జరిగిన అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చెలరేగిన హింసపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నర్సరావుపేట, కారంపూడి పోలీస్ స్టేషన్లకు వెళ్లి సమాచారాన్ని సేకరించారు.
ఎఫ్ఐఆర్‌లపై దృష్టి..
కారంపూడిలో జరిగిన దాడులపై పల్నాడ్ సీఐ నారాయణ స్వామిని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్‌లో పోలీసులు నమోదు చేసిన పలు సెక్షన్లను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. దాడుల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్సీపీల నుంచి దాడులపై సిట్‌కు ఫిర్యాదులు అందాయి.
సమగ్ర దర్యాప్తు
ఇక రెండు రోజుల నుంచి తాడిపత్రిలో సిట్ బృందం పరిశీలిస్తుంది. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తుంది. స్థానికులు, పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని సిట్ పరిశీలిస్తుంది. సిట్ డీఎస్పీ రవి మనోహర్ చారి తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు సేకరించారు. పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఈవీఎం స్ట్రాంగ్ రూంల దగ్గర చెలరేగిన హింసపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైన ఎఫ్ఐఆర్‌ను డీఎస్పీ పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ దగ్గరి నుంచి మహిళా యూనివర్సిటీకి వచ్చి టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని, ఆయన వాహనాలపై దాడి జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని కూచువారిపల్లి, రాంరెడ్డిగారి పల్లికి వెళ్లారు. కూచువారిపల్లిలో అల్లర్లలో ఓ ఇంటిని కొంతమంది వ్యక్తులు దగ్ధం చేశారు.
ఆ సమయాలపై సిట్ దృష్టి
రాంరెడ్డి గారి పల్లిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన గన్‌మెన్ ఇంటికి కూడా సిట్ డీఎస్పీ వెళ్లి ఆరా తీశారు. ఘటనలు వివిధ సమయాల్లో జరగడంతో దానిపైనా కూడా విచారిస్తున్నారు. నేతలు, పోలీసులు చెబుతున్న దానికి, సీసీ ఫుటేజ్‌లో ఉన్న సమయాలకు తేడా ఉండటంతో.. దానిపై కూడా సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. ఆర్టీఓ నిశాంత్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన నివేదికను కూడా పరిశీలిస్తున్నారు.ఈ నెల13,14 వ తేదీల్లోని కాల్‌డేటాలపై కూడా సిట్ దృష్టి సారించింది.
వారిని ఇరికించారని...
కాగా ఈ కేసులో సామాన్యులపై అల్లర్ల కేసును నమోదు చేశారని తిరుమలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఆరోపిస్తున్నారు. అసలు దోషులను వదిలివేసి కావాలనే తమ వారిని ఇరికించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లర్లకు సంబంధించిన వారికి, వీరికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ సిట్ విచారణ చేయనున్నది. వీరి కాల్ రికార్డులపై కూడా సిట్ దృష్టి సారించింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అతని అనుచరులను సిట్ అధికారులు ఈరోజు లేదా రేపు విచారించే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..
కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..
ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News