Share News

AP Elections 2024: చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో అండగా ఉంటాం: తన్జీమ్ ముస్లిం సంస్థ

ABN , Publish Date - May 07 , 2024 | 04:47 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గర పడుతుండటంతో పలువురి మద్దతు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి లభిస్తోంది. అన్నిమతాలు, కులాల వారి నుంచి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) అపూర్వ ఆదరణ వస్తోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పలు సంస్థలు టీడీపీతో కలిసి వస్తున్నాయి. ఇందులో భాగంగానే యూపీలోని దియోబంద్ నగరం కేంద్రంగా పని చేస్తున్న తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) టీడీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.

AP Elections 2024:  చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో అండగా ఉంటాం: తన్జీమ్ ముస్లిం సంస్థ

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గర పడుతుండటంతో పలువురి మద్దతు తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party)లభిస్తోంది. అన్నిమతాలు, కులాల వారి నుంచి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) అపూర్వ ఆదరణ వస్తోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పలు సంస్థలు టీడీపీతో కలిసి వస్తున్నాయి. ఇందులో భాగంగానే యూపీలోని దియోబంద్ నగరం కేంద్రంగా పనిచేస్తున్న తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) టీడీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.


AP Elections: పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పట్టించుకోని పోలీసులు...

తన్జీమ్ సంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ ఉల్ హదీస్ అల్లమా ముఫ్తీ జియా ఉల్లాఖాన్ ఖాసిమీ, కోశాధికారి అల్లమా ముఫ్తీ ఘుప్రాన్, సంస్థ ఏపీ అధ్యక్షులు ముఫ్తీ ఇస్మాయిల్ ఖాసిమీ హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మంగళవారం భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ భేటీలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి ఖాసిమీ మాట్లాడుతూ... చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ముస్లిం సమాజం సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు.


AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

ముస్లిం యువతకు ఉపాధి, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి టీడీపీ కృషిచేస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలవాలని కోరారు. అమరావతి రాజధానిగా కొనసాగడం, ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని జియా ఉల్లా ఖాన్ ఖాసిమీ తెలిపారు. అనంతరం ఈ సంస్థ కోశాధికారి అల్లమా ముఫ్తీ ఘుప్రాన్ మాట్లాడుతూ... జగన్ పాలనలో ముస్లింలపై ఒక వైపు కిరాతక దాడులు, మరోవైపు బలవంతపు మతమార్పిడిలు జరగుతుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలుకుతున్నట్లు అల్లమా ముఫ్తీ ఘుప్రాన్ పేర్కొన్నారు.


AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 05:15 PM