Share News

Chandrababu: జగన్ బతుకే ఒక ఫేక్ బతుకు.. నీచమైన తీరు వారి డీఎన్‌లోనే ఉంది..

ABN , Publish Date - Apr 02 , 2024 | 09:53 AM

Andhrapradesh: పెన్షన్ల అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. పెన్షన్లు ఇవ్వనీయకుండా టీడీపీ అడ్డుకుంటోందని వైసీపీ ఆరోపణలు చేస్తుంటే... వైసీపీది అంతా తప్పుడు ప్రచారం అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారపార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య పెన్షన్ల అంశంపై మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ట్విట్టర్ వేదికగా పెన్షన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.

Chandrababu: జగన్ బతుకే ఒక ఫేక్ బతుకు.. నీచమైన తీరు వారి డీఎన్‌లోనే ఉంది..

అమరావతి, ఏప్రిల్ 2: పెన్షన్ల అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. పెన్షన్లు ఇవ్వనీయకుండా టీడీపీ (TDP) అడ్డుకుంటోందని వైసీపీ (YSRCP) ఆరోపణలు చేస్తుంటే... వైసీపీది అంతా తప్పుడు ప్రచారం అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారపార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య పెన్షన్ల అంశంపై మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) స్పందించారు. ట్విట్టర్ వేదికగా పెన్షన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్‌పై (CM Jagan) విరుచుకుపడ్డారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందే నీచమైన తీరు జగన్ డీఎన్ఎలోనే ఉందన్నారు. పెన్షన్‌లు పంపిణీ చేయొద్దని తామెప్పుడూ చెప్పలేదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అవ్వ తాతాలను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని టీడీపీ అధినేత మండిపడ్డారు.

AP Elections: మేమూ రెడ్లమే.. జగన్‌‌ను మళ్లీ గెలిపిస్తే..?


చంద్రబాబు ట్వీట్ ఇదే...

‘‘వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డీఎన్ఎలోనే ఉంది. పెన్షన్‌లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదు అని ఎన్నికల సంఘం కూడా ఆదేశించలేదు. పెన్షన్‌ల విషయంలో నేడు జరుగుతుంది అంతా పెద్ద రాజకీయ కుట్ర. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్దులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదు. ప్రజలారా కుట్రలను చేదించండి....దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి. అధికారం లోకి రాగానే పెన్షన్ రూ.4000 కు పెంచి అనవసర ఆంక్షలు తొలగించి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తాం’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

chandrababu-pension.jpg

ఇవి కూడా చదవండి...

YS Sharmila: కడప జిల్లాలో పర్యటించనున్న షర్మిల

Lok Sabha Polls: టోల్‌ బాదుడుకు 2 నెలల విరామం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 02 , 2024 | 10:40 AM