Share News

AP Elections: టీడీపీ చీఫ్ చంద్రబాబు నామినేషన్ వేసేది ఎప్పుడో తెలుసా..!

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:23 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి గెలుపు తమదే అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఏపీలో ఈసారి ఎవరికి అధికారం దక్కనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఏపీలో రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది.

AP Elections: టీడీపీ చీఫ్ చంద్రబాబు నామినేషన్ వేసేది ఎప్పుడో తెలుసా..!
TDP Chief Chandrababu Naidu Nomination Date

అమరావతి, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు (AP Elections 2024) మరికొద్దిరోజులే సమయం ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి గెలుపు తమదే అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఏపీలో ఈసారి ఎవరికి అధికారం దక్కనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఏపీలో రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీలు, ఊరేగింపులతో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో సమర్పించనున్నారు.

Pawan Kalyan: జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్..


చంద్రబాబు నామినేషన్..

కాగా... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu)నామినేషన్ వేసే తేదీ ఖరారైంది. ఈనెల 19న టీడీపీ చీఫ్ నామినేషన్ వేయనున్నారు. తాను బరిలోకి దిగనున్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు టీడీపీ వర్గాలు ప్రకటించాయి. అయితే చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 19న మధ్యాహ్నం 12:33 గంటలకు నామినేషన్ వేస్తారు. భారీ ర్యాలీతో భువనమ్మ నామినేషన్‌ వేసేందుకు రానున్నారు. ఇందు కోసం భువనేశ్వరి రేపు (గురువారం) కుప్పం చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం కుప్పం ఆలయంలో భువనమ్మ పూజలు చేయనున్నారు. ఆపై భారీ ర్యాలీగా వెళ్లి చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు.

AP Politics: ‘బీ కేర్ ఫుల్ ఆఫీసర్స్’.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్..


రేపటి నుంచే కీలక ఘట్టం..

కాగా.. ఏపీలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రేపు కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఏపీలో మే 13న 25 లోక్‌సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించేశాయి కూడా. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరుగనుండగా.. ఏపీలో నాలుగో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మంచి ముహూర్తం చూసుకుని మరీ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉండనుండగా, ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక మే 13 ఎన్నికలు జరుగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.


ఇవి కూడా చదవండి...

Lok Sabha election 2024: ఎల్లుండి తొలి దశ పోలింగ్: నేటితో ప్రచారానికి తెర

AP News: జగన్‌పై రాయి దాడి ఘటనలో మరొకరి అరెస్ట్.... ఇదెక్కడి దారుణమంటున్న కుటుంబీకులు

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 17 , 2024 | 02:53 PM