Share News

TDP: వైసీపీలో సీఎం అభ్యర్థిపై ఆ పార్టీ నేతల్లోనే చర్చ: రవి నాయుడు

ABN , Publish Date - Mar 25 , 2024 | 12:43 PM

Andhrapradesh: 2024 ఎన్నికల తరువాత వైసీపీలో సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడం విడ్డూరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో నెలజీతగాడు అంటూ కామెంట్స్ చేశారు.

TDP: వైసీపీలో సీఎం అభ్యర్థిపై ఆ పార్టీ నేతల్లోనే చర్చ: రవి నాయుడు

తిరుపతి, మార్చి 25: 2024 ఎన్నికల (AP Elections) తరువాత వైసీపీలో (YSRCP) సీఎం అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు (Telugu Youth State General Secretary Ravi Naidu) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడటమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల ప్రతిపక్షాలను విమర్శించడం విడ్డూరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో నెలజీతగాడు అంటూ కామెంట్స్ చేశారు. ఏపీలో (Andhrapradesh) డ్రగ్స్ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపిందన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై సీఎం (CM Jagan) ఇంత వరకు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ నేతలకు (TDP Leaders) ఎలాంటి సంబంధం లేదని.. డ్రగ్స్‌కు పాత్రధారులు, సూత్రధారులు వైసీపీ నేతలే (YSRCP Leaders) అని ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను (TDP Leader Nara lokesh) డ్రగ్స్ వ్యవహారంలో ఇరికించే అవకాశం ఉందని మండిపడ్డారు.

London: నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి మృతి


పోలీసులపై తమకు అనుమానం ఉందని.. సజ్జలతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ కారును నిలపని పోలీసులు లోకేష్ కారును ఎందుకు నిలిపారని నిలదీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కారణంగా ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం ఇంటిలోను, భారతి సిమెంట్స్ కార్యాలయంలోను, సజ్జల ఇంటిలో ఎన్నికలకు ఖర్చు పెట్టేందుకు కోట్ల రూపాయల డబ్బులు దాచారని.. ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా మారిందని పెద్ద ఎత్తున ఆందోళన చేశామన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపితే తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వద్దు.. యువత భవిష్యత్తు ముద్దు అంటూ తెలుగు యువత నేతలు ప్లకార్డులను ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి...

EC: ఏపీ రాష్ట్ర అధికారుల తీరుపై ఈసీ విస్మయం..

Purandeswari: ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నేతలతో పురందేశ్వరి సమావేశం..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2024 | 12:57 PM