Share News

TDP: డామిట్ కథ అడ్డం తిరిగింది.. గులకరాయి దాడిపై వర్ల రామయ్య ఎద్దేవా

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:52 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గులకరాయి కథ అడ్డం తిరిగిందని.. వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికే ఎదురుతిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఆడే డ్రామా పూర్తవకముందే ఎదురుతిరిగి నటులు అభాసుపాలయ్యారన్నారు. ఒకేరాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవడం ఆశ్చర్యకరమని సెటైర్ విసిరారు.

TDP: డామిట్ కథ అడ్డం తిరిగింది.. గులకరాయి దాడిపై వర్ల రామయ్య ఎద్దేవా
TDP Leader Varlaramaiah

అమరావతి, ఏప్రిల్ 16: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) గులకరాయి కథ అడ్డం తిరిగిందని.. వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికే ఎదురుతిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ ఆడే డ్రామా పూర్తవకముందే ఎదురుతిరిగి నటులు అభాసుపాలయ్యారన్నారు. ఒకేరాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవడం ఆశ్చర్యకరమని సెటైర్ విసిరారు. గులకరాయి కథ ఎవరు రచించారో గానీ కథలో పట్టులేదని.. అందుకే రక్తికట్టలేదంటూ వ్యాఖ్యలు చేశారు.

Telangana: నల్గొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మార్పు.. కొత్తగా ఎవరంటే?

ABN ఛానల్ ఫాలో అవ్వండి

గతంలో చిన్న కోడికత్తితో గుచ్చితే ఐదు సంవత్సరాలు ఒక అమాయకుడిని జైల్లో పెట్టించిన ఘనత జగన్ ది విమర్శలు గుప్పించారు. విజయవాడ సీపీ రాణా ఒక అర్భకుడిని, అమాయకుడిని బలిచేయబోతున్నారన్నారు. జగన్ అధికార దాహానికి మరో అమాయకుడు జైలు పాలు కాబోతున్నారని మండిపడ్డారు. ఒక అర్భకుడిని బలిచేసి చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీపీ రాణాకు తెలియజేస్తున్నానని హితవుపలికారు. ‘‘చిట్ట చీకటిలో వచ్చిన రాయిని కెమెరాలో ఎలా బంధించగలరు? స్కాట్లాండ్ యార్డు పోలీసులు కూడా పట్టుకోలేని ఈ అగంతకుడిని మన పోలీసులు ఎలా పట్టుకుంటారు? వైసీపీ ట్రేడ్ మార్క్ గొడ్డలి అయితే గులకరాయి ఎందుకు వాడారు? అందుకే కథ అడ్డం తిరిగింది’’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

YSRCP: 28 ఏళ్ల నిరీక్షణ.. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష


జగన్, సజ్జలను సంతృప్తి పరచడానికి రాణా తాపత్రయపడటం మంచిదికాదన్నారు. గజమాలకు ఉన్న పుల్ల గుచ్చుకోగానే ఆయన చేయి అక్కడికే వెళ్లిందని.. అక్కడి నుంచి నాటకం ప్రారంభమైందని.. టవల్‌తో గాయాన్ని అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్‌కు అందించిన నైపుణ్యతా వైద్యం డ్రామాలో భాగమే అని అన్నారు. గులకరాయి డ్రామా రచించిన రచయితకు నంది అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ఆడిన డ్రామాలో భాగస్వాములు కావద్దని రాణాకు సూచనలు చేశారు. ప్రజలు జగన్ ఆడినది ముమ్మాటికి డ్రామానే అని అర్థం చేసుకున్నారన్నారు. జగన్ ఆడిన ఈ గులకరాయి డ్రామాలో అద్భుతంగా నటించిన జగన్‌కు ‘ఆస్కార్’ అవార్డు ఇవ్వాలి అంటూ వర్ల రామయ్య సెటైర్ విసిరారు.


ఇవి కూడా చదవండి...

YS Sharmila: పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఆయన చెప్పిందే చేస్తారు

AP Election 2024: జగన్ సర్కారు అలా చేయొద్దు.. ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 03:54 PM