Share News

AP Elections: కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నామినేషన్

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:32 PM

Andhrapradesh: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి నామినేషన్ దాఖలైంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లాలో తొలి నామినేషన్ వేశారు. కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.

AP Elections: కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నామినేషన్
Vemireddy Prashanti Reddy Files Nomination

నెల్లూరు, ఏప్రిల్ 18: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ (Nomination) దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి నామినేషన్ దాఖలైంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లాలో తొలి నామినేషన్ వేశారు. కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Vemireddy Prashanti Reddy) రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం ఆనందంగా ఉందన్నారు. ‘‘నా విజయం ఖాయం.. కోవూరు అభివృద్ధి ఖాయం’’ అని స్పష్టం చేశారు. సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు.

Attack On Jagan: జగన్‌పై రాయి దాడి కేసులో కీలక అప్డేట్


చంద్రబాబు సీఎం అయిపోయారు...: వేమిరెడ్డి

ప్రశాంతి నామినేషన్‌కు వచ్చిన ఆదరణ చూస్తే గెలిచినట్టే భావిస్తున్నామని వేమిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిపోయారన్నారు. ప్రతి దగ్గర అనూహ్య స్పందన కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గం ఒక ఊపు కనిపిస్తుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని.. ఎన్డీఏలో ఉండటం వలన అభివృద్ధి సులువవుతుందని చెప్పారు. జిల్లాలో మొట్టమొదటి నామినేషన్ దాఖలు చేశామని మరోనేత అజిజ్ తెలిపారు. నిరాడంబరంగా వచ్చి నామినేషన్ వేయాలనుకున్నామని.. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. ఈ రోజు నుంచి రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయిందని అజిజ్ వ్యాఖ్యలు చేశారు.

AP Elections: వైసీపీ లెక్కలు తారుమారు.. ఆందోళనలో అభ్యర్థులు..


కోవూరు అభివృద్ధి కోసమే పోటీ: నారాయణ

ఐదు మందిని ఆహ్వానిస్తే వేలమంది వచ్చారని టీడీపీ నేత నారాయణ అన్నారు. రాజకీయాలకు వేమిరెడ్డి డబ్బు సంపాదించుకోవడానికి రాలేదని.. వైసీపీలో దక్కని గౌరవం టీడీపీలో దక్కుతుందని వచ్చారని తెలిపారు. నెల్లూరు పార్లమెంట్‌ను, కోవూరు నియోజకవర్గన్ని అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నారని వెల్లడించారు. టీడీపీ గెలుపుతోనే కోవూరు అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

Big Breaking: పిఠాపురం వైసీపీ అభ్యర్థికి అస్వస్థత.. మధ్యలోనే వెళ్లిపోయిన గీత!

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 02:35 PM