Share News

AP Politics:ఓవైపు గెలుపుపై ధీమా.. మరోవైపు టెన్షన్..!

ABN , Publish Date - May 23 , 2024 | 09:52 AM

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసి పది రోజులైంది. ఎన్నికల ఫలితాలు తెలియాలంటే మరో 11 రోజులు ఓపికపట్టాలి. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో స్పష్టత రానుంది. ఈలోపు రాజకీయ పార్టీ నేతలను టెన్షన్ వెంటాడుతోంది.

AP Politics:ఓవైపు గెలుపుపై ధీమా.. మరోవైపు టెన్షన్..!
TDP and YSRCP

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసి పది రోజులైంది. ఎన్నికల ఫలితాలు తెలియాలంటే మరో 11 రోజులు ఓపికపట్టాలి. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో స్పష్టత రానుంది. ఈలోపు రాజకీయ పార్టీ నేతలను టెన్షన్ వెంటాడుతోంది. పైకి గెలుస్తామని ఓవైపు ఎన్డీయే కూటమి (NDA Alliance), మరోవైపు వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోపల ఎక్కడో ఓటమి భయం పట్టుకుందట. ఎవరికి వారు వందకు పైగా సీట్లలో ఈజీగా గెలుస్తామని చెబుతున్నారు. తాము గెలిచే నియోజకవర్గాలు ఏమిటో పార్టీలు లెక్కలు వేసుకున్నాయి. కానీ.. లెక్క తప్పితే పరిస్థితి ఏమిటనే ఆందోళన అందరి నాయకుల్లో కనిపిస్తోందట. ఈ ఓటమి భయం అధికార పార్టీలో కొంచెం ఎక్కువుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేశారని ఓవైపు వైసీపీ (YSRCP) నేతలు ధీమాగా ఉన్నా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత వరకు ప్రభావం చూపిస్తుందనేదానిపైనే ఫలితం ఆధారపడనుంది. ప్రభుత్వ అనుకూల ఓటు కంటే.. వ్యతిరేక ఓటింగ్ ఎక్కువుగా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట.

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..


ఇరు పార్టీల ధీమా..

అసెంబ్లీ ఎన్నికల్లో 150కి పైగా సీట్లు గెలుస్తామని ఓ వైపు ఎన్డీయే కూటమి, మరోవైపు వైసీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇబ్బబోతున్నారని.. గత ఐదేళ్ల పాలన వైసీపీ పాలన చూసిన తర్వాత ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారని.. దానికి అనుగుణంగానే ఓటింగ్ జరిగిందనే చర్చ నడుస్తోంది. మరోవైపు ప్రభుత్వ పనితీరు నచ్చడంతో.. మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఓటింగ్ శాతం పెరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఓటింగ్ సరళి చూసిన తర్వాత విజయం తమదేనని ఎన్డీయే నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే ప్రజలు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారని టీడీనీ, జనసేన, బీజేపీ నాయకులు చెబుతున్నారు. గెలుపుపై మాత్రం ఎన్డీయే కూటమి, వైసీపీ దీమా వ్యక్తం చేస్తున్నాయి.


ఆ ఓట్లు కీలకం..

యువత ఓట్లు ఎటు పడ్డాయనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఓవైపు మధ్యతరగతి మహిళలు, వృద్ధులు వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో కొంతమంది చదువుకున్న మహిళలు మాత్రం కూటమి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. వృద్ధులు ఓట్లు కూటమికి, వైసీపీకి చీలిపోయాయని.. ఈక్రమంలో విజేతను నిర్ణయించేది యువత ఓట్లు మాత్రమేననే చర్చ నడుస్తోంది. యువత ఎన్డీయే కూటమి అభ్యర్థులకే మద్దతుగా నిలిచారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. జగన్ అరాచకపాలనకు అంతం పలకాలనే ఉద్దేశంతో యువత అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారనే ప్రచారం ఉంది. యువత ఓట్లు ఎవరివైపు పడ్డాయి.. ఏ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారో తెలియాలంటే జూన్4 వరకు ఆగల్సిందే.


ఏపీకి ‘అష్ట’కష్టాలు!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 23 , 2024 | 09:53 AM