YS Jagan: తల్లి, చెల్లిని పావుగా వాడుకున్న జగన్
ABN , Publish Date - May 27 , 2024 | 01:30 PM
ఏరు దాటే దాక ఓడమల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న.. ఇది మనం తరచుగా వినే సామెత.. చేసిన సహాయాన్ని మరిచిపోయి కృతజ్ఞత చూపని వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు.. ఇది... ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్‌కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుందంటున్నారు ఏపీ ప్రజలు.. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి అరెస్టై నేటికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఒక్కసారి గతమంతా ఏపీ ప్రజల కళ్లముందు కదులుతోంది.. ఆ సమయంలో జగన్ కుటుంబం ఆడిన డ్రామా.. ఆస్కార్ నటులను మించి పలికించిన హావభావాలు.. సొంత కుటుంబ సభ్యులను తన రాజకీయ స్వార్థం కోసం వాడుకొని వదిలేసిన విధానం.. తాను జైల్లో ఉన్నన్ని రోజులు తన వారిని, అయిన వారిని రోడ్ల మీద ఉంచి.. ప్రజల్లో పొందిన సానుభూతి.. వాటి ద్వారా అధికారంలోకి వచ్చిన విధానం.. ఇవన్నీ తలచుకొని ఏపీ ప్రజలు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏరు దాటే దాక ఓడమల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న.. ఇది మనం తరచుగా వినే సామెత.. చేసిన సహాయాన్ని మరిచిపోయి కృతజ్ఞత చూపని వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు.. ఇది... ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్‌కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుందంటున్నారు ఏపీ ప్రజలు.. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి అరెస్టై నేటికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఒక్కసారి గతమంతా ఏపీ ప్రజల కళ్లముందు కదులుతోంది.. ఆ సమయంలో జగన్ కుటుంబం ఆడిన డ్రామా.. ఆస్కార్ నటులను మించి పలికించిన హావభావాలు.. సొంత కుటుంబ సభ్యులను తన రాజకీయ స్వార్థం కోసం వాడుకొని వదిలేసిన విధానం.. తాను జైల్లో ఉన్నన్ని రోజులు తన వారిని, అయిన వారిని రోడ్ల మీద ఉంచి.. ప్రజల్లో పొందిన సానుభూతి.. వాటి ద్వారా అధికారంలోకి వచ్చిన విధానం.. ఇవన్నీ తలచుకొని ఏపీ ప్రజలు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు... వార్నీ.. జగన్ రెడ్డి డ్రామాకు అప్పుడే పుష్కర కాలం ముగిసిపోయిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు..
12 ఏళ్ల క్రితం అరెస్ట్
2012, May 27... హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ హౌస్‌లో అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో.. విచారణ అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్దిని సీబీఐ అరెస్ట్ చేసింది.. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో జగన్‌ను సీబీఐ సుదీర్ఘంగా విచారించింది.. మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో అనుమతులు లభించాయన్న నేపథ్యంలో.. జగన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన 58 కంపెనీలకు కూడా సీబీఐ, ఈడీ సమన్లు పంపాయి.. వాటిపై విచారణ కొనసాగుతుండగా జగన్ జ్యుడీషియల్ కస్టడీ పదే పదే పొడిగించారు.. ఇలా జగన్ పదహారు నెలలు జైలు జీవితం అనుభవించిన తర్వాత 2013 సెప్టెంబరు 23న బెయిల్ మీద బయటకు వచ్చారు.. ఇక అప్పటి నుంచి పదేళ్లకు పైగా జగన్ బెయిల్‌పై బయటే దర్జాగా తిరుగుతున్నారు.. విచారణకు పదే పదే మినహాయింపులు కోరుతూ వచ్చిన జగన్ .. సీఎం అయిన తర్వాత ఐదేళ్లుగా విచారణకు గైర్హాజరు అవుతూనే ఉన్నారు.. దీనిపై ప్రజలు, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. జగన్ రెడ్డి తీరు డోంట్ కేర్ అన్నట్లుగా ఉంది.
పావుగా వాడుకొని, వదిలేసి
ఇదంతా ఒక కోణం అయితే.. తన రాజకీయ ఎదుగుదల కోసం కన్న తల్లిని, సొంత చెల్లిని ఉపయోగించుకున్న జగన్.. ఇప్పుడు వారిని కూరలో కరివేపాకులా పక్కన పడేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. నిజానికి జగన్ అరెస్ట్ సమయంలో కుటుంబం మొత్తం ఆయనకు అండగా నిలిచింది.. తల్లి విజయలక్ష్మి, భార్య భారతి, చెల్లి షర్మిల సహా కుటుంబ సభ్యులు అందరూ రోడ్డు మీదకు వచ్చేశారు.. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టు CBI ప్రకటించిన తర్వాత.... జగన్ మీద కక్షతోనే ఇదంతా చేస్తున్నారంటూ నినదించారు.. దిల్‌కుషా గేట్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాను ఆకర్షించారు.. తమ గొంతుకను బలంగా వినిపించారు.. కేవలం ఆ సమయంలో మాత్రమే కాదు.. జగన్ జైల్లో ఉన్న పదిహారు నెలల సమయంలోనూ.. తమ గొంతును గట్టిగా వినిపించడంలో షర్మిల, విజయలక్ష్మి గట్టిగా కృషి చేశారు.. అంతవరకు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడడం అన్నదే తెలియని ఆ మహిళలు ఇద్దరూ జగన్ కోసం రోడ్ల మీదకు వచ్చి.. జగన్‌కు అన్యాయం జరిగింది అంటూ.. ప్రజల మనస్సుల్లో గట్టినా నాటేందుకు ప్రయత్నించారు.
జగన్ అన్న వదిలిన బాణం అంటూ
నిజానికి.. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు తెరమీదకి వచ్చిన షర్మిలా రెడ్డి అన్న జగన్ అక్రమ ఆస్తుల కేసులో జైలుకు వెళ్లిన సందర్భంలో నిర్వహించిన పాత్ర ఎప్పటికీ తెలుగు ప్రజలు మరిచిపోలేదు.. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురును. జగనన్న వదిలిన బాణాన్ని.. అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ తెలుగు ప్రజల చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అప్పటి ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఆమె పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దిగ్విజయంగా పూర్తి చేశారు. దాదాపు 3000 కిలో మీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. ఉప ఎన్నికల్లో వైసీపీ విజయానికి అది ఎంతో హెల్ప్ అయ్యింది.. జగన్‌కు ప్రజల్లో ఎంతో సింపతీని తెచ్చి పెట్టింది.
తల్లి, చెల్లి కలిసి
ఆ తర్వాత తన తల్లితో కలిసి ఆమె ఎన్నికల ర్యాలీల్లో సైతం పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీని బలంగా ఆమె, ఆమె తల్లి ఇద్దరూ ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అప్పటి ఎన్నికల్లో జగన్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. విజయలక్ష్మి కూడా తన బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండంటూ ప్రజలను వేడుకున్నారు.. అయితే.. తన కోసం ఇంతగా చేసిన తన తల్లిని, చెల్లిని జగన్ పక్కన పెట్టేశారు.. వారిద్దరినీ ఎంతగా దూరం పెట్టారో, ఎంతగా అవమానించారో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.. అలా ఆ రోజున తాను కష్టాల్లో ఉన్న రోజుల్లో .. తల్లిని, చెల్లిన పావులుగా వాడుకొని.. రాజకీయంగా ఎదిగిపోయిన జగన్ వెంట.. ఇప్పుడు తోడుగా ఉన్నది కేవలం తన భార్య భారతి ఒక్కరు మాత్రమే.. అవసరం తీరే వరకూ ముఖ స్తుతి చేసి.. తీరా అధికార అందలం ఎక్కించిన తర్వాత.. సొంత తల్లిని, చెల్లిని పక్కన పడేసిన జగన్ నైజాన్ని.. జైలు కెళ్లి పన్నెండేళ్లు అయిన సందర్భంగా ఏపీ ప్రజలు మరోసారి తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టై నేటికి పన్నెండేళ్లు పూర్తి
2012 మే 27న హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్‌హౌస్‌లో జగన్ అరెస్ట్
అక్రమాస్తుల అభియోగాలతో జగన్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
16 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన జగన్ రెడ్డి
2013 సెప్టెంబరు 23న బెయిల్ మీద బయటకు వచ్చిన జగన్ రెడ్డి
పదేళ్లకు పైగా బెయిల్‌పై బయటే దర్జాగా తిరుగుతున్న జగన్
ఐదేళ్లుగా జగన్ విచారణకు గైర్హాజరవుతుండడంపై తీవ్ర విమర్శలు
తల్లి, చెల్లి విషయంలో ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా జగన్ తీరు
జగన్ అరెస్ట్ సమయంలో జగన్ అండగా నిలిచిన విజయలక్ష్మి, షర్మిల
జగన్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించిన తల్లి, చెల్లి, భార్య
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిల
దాదాపు 3వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిల
ఉప ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఎంతో కృషి చేసిన షర్మిల
జగన్ కోసం షర్మిలతో కలిసి ర్యాలీలు, సభల్లో పాల్గొన్న విజయలక్ష్మి
తన బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వమంటూ ప్రజలను వేడుకున్న విజయలక్ష్మి
తల్లిని, చెల్లిని పావులుగా వాడుకొని రాజకీయంగా ఎదిగిపోయిన జగన్
అధికారం అందలం ఎక్కించిన తర్వాత నిజస్వరూపాన్ని బయటపెట్టిన జగన్
అధికారంలోకి రాగానే తల్లిని, చెల్లిని పక్కన పెట్టేసిన జగన్ రెడ్డి