AP Elections 2024: ఇవి మామూలు పంచ్‌లు కాదయ్యా.. ఆర్‌పీ ఆడుకున్నాడుగా..!
ABN , Publish Date - May 08 , 2024 | 06:35 PM
టాలీవుడ్ సెలబ్రిటీలు(Tollywood Celebrities) ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు.. ఎన్డీయే కూటమి(NDA) నేతలకు సపోర్ట్‌గా ప్రకటనలు, ప్రచారం చేస్తుండగా.. తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్‌పి(Jabardasth Kirak RP) సంచలన కామెంట్స్ చేశాడు.
నెల్లూరు, మే 08: టాలీవుడ్ సెలబ్రిటీలు(Tollywood Celebrities) ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు.. ఎన్డీయే కూటమి(NDA) నేతలకు సపోర్ట్‌గా ప్రకటనలు, ప్రచారం చేస్తుండగా.. తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్‌పి(Jabardasth Kirak RP) సంచలన కామెంట్స్ చేశాడు. సీఎం జగన్(CM YS Jagan), రోజా(RK Roja) పై తనదైన శైలిలో పంచ్‌లు వేశాడు. నెల్లూరు(Nellore) టీడీపీ(TDP) ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి(Vemireddy Prabhakar Reddy) మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోబోతున్నాడని అన్నాడు. విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ ఓడిపోతున్నాడని జోస్యం చెప్పాడు.
ఆర్‌పీ కామెంట్స్..
‘నాకు రాజకీయ అనుభవం లేదు. కానీ, నెల్లూరు వేమిరెడ్డి దంపతుల సర్వీస్ నచ్చి వారికి సపోర్ట్ చేస్తున్నాను. వారు వివాద రహితులు, సౌమ్యులు. వారికి సపోర్ట్ చేసే క్రమంలో రాజకీయాల్లో తిరిగాను. రాష్ట్రంలో జగన్ ఓడిపోబోతున్నాడు. విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కూడా ఓడిపోబోతున్నారు. వీరి ఓటమికి కారణం రౌడీ రాజకీయమే. వివేకానంద రెడ్డిని హత్య చేయించటం, షర్మిలను తిట్టించడం, కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడటం వల్లే ఆయన ఓటమిపాలవుతున్నారు. జగన్ వైఖరి కారణంగా.. ఆయన దగ్గరి వారందరూ దూరమయ్యారు. పేటీఎం గాళ్లకు ఇచ్చే డబ్బులను జగన్ రాష్ట్రాభివృద్ధి కోసం ఖర్చు పెడితే బాగుండేది.’ అంటూ జగన్‌పై సంచనల కామెంట్స్ చేశాడు ఆర్పీ.
వీరికి పెళ్లిళ్లే కావాలి..
‘ఎవరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారనేదే వీరికి కావాలి. జగన్‌కు ఒక పెళ్లి కావటం వల్లే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడు. తిరుమల కొండపై అన్నం కూడా సరిగ్గా ఉడకటం లేదు. తిరుమల లడ్డు కూడా కల్తీ అయిపోయింది. హుండీ డబ్బులను నిలువు దోపిడి కానులకను కూడా జగన్ దోచేస్తున్నారు. తిరుమలను ప్రతిష్ఠను దెబ్బతీశారు. టీడీపీ ప్రభుత్వం తిరుమలను అద్భుతంగా అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి ప్రజల సపోర్ట్ బాగుంది. 140 సీట్లతో కూటమిని గెలిపించాలి.’ అని ప్రజలకు ఆర్పీ పిలుపునిచ్చాడు.
రోజాపై ఆర్పీ సెన్సేషన్ కామెంట్స్..
ఇదే సమయంలో సినీనటి, మంత్రి రోజాపైనా సంచలన కామెంట్స్ చేశాడు రోజా. ‘రోజా మాకు గౌరవం ఇస్తే.. మేము గౌరవిస్తాం. రోజా యువరాణి గొప్ప నటా.. ఆస్కార్ అవార్డులు ఏమైనా కొట్టిందా? కనీసం గెటప్ శీను, ఆది, సుధీర్ లా స్కిట్స్ చేయగలదా .. రాష్ట్రంలో ఓడిపొయే ఫస్ట్ సీటు రోజానే. జగన్ చేసే దుర్మార్గాలను అడగలేదు కానీ.. వారానికోసారి రోజా తిరుమల వెళ్తుంది.’ అంటూ మంత్రి రోజాపై ఆర్పీ తీవ్రమైన కామెంట్స్ చేశాడు.
జగన్ పారిపోవడం ఖాయం..
సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్న జగన్.. మరికొన్ని రోజుల్లో దేశం విడిచి పారిపోవడం ఖాయం అని ఆర్పీ వ్యాఖ్యానించాడు. విజయ్ మాల్యాలా జగన్ లండన్ పోతున్నాడని విమర్శించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి కూటమి వస్తుందని.. వైసీపీ ఓటమి వస్తుందని జోస్యం చెప్పాడు ఆర్పీ. ప్రజలు, దేవుడు ఆశీస్సులతో చంద్రబాబు గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని ఆర్పీ విశ్వాసం వ్యక్తం చేశాడు.