Home » Roja
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు పూర్తి అర్హులని కిరాక్ ఆర్పీ ప్రశంసించారు. రోజా టూరిజం మంత్రిగా పనిచేసిన గత రెండున్నరేళ్లలో వేల టిక్కెట్లను దుర్వినియోగం చేశారని ఆయన కూడా చెప్పారని, విజిలెన్స్ శాఖకు కూడా ఆ విషయాన్ని అప్పగించారని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిపై సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు ఇచ్చేందుకు పోలీసులు నానా హైరానా పడుతున్నారని ఆమె ఆగ్రహించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని.. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది...
రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.
రుషికొండపై మాజీ మంత్రి రోజా ట్వీట్కు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషికొండ విషయమై రోజా మాట మార్చడాన్ని ప్రశ్నించారు. రోజాని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలతో పాటు నాడు చెప్పిన త్రి మ్యాన్ కమిటీ కథ కూడా బయటకు వస్తుందని వెల్లడించారు. ఓటమి కారణంగా రోజాకు మతి చెడిందని ఎద్దేవా చేశారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. ఏపీలో మంత్రులంతా దాదాపు ఇంటి బాట పడుతున్నారు. వారిలో రోజా కూడా ఒకరు. రెండు రౌండ్లు పూర్తవగానే రోజా ఇంటి బాట పట్టారు. వైసీపీలో ఎగిరెగిరి పడిన నేతల్లో రోజా ఒకరు. ఆమె నోటికి ఎవరైనా భయపడాల్సిందే. నియోజకవర్గానికి చేసిందేమీ లేదు కానీ పార్టీకి మాత్రం అన్నీ తానయ్యారు. అంటే పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కాదు.
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూటమి అధికారం చేపడుతుందని మెజార్టీ సంస్థలు స్పష్టం చేశాయి. విజయం తమదేనని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కానే కాదని తేల్చి చెబుతున్నారు. ఆ జాబితాలో మంత్రి ఆర్కే రోజా చేరారు.
నగరి అసెంబ్లీ సీటులో గెలుపుపై బెట్టింగ్ జోరందుకుంది. కౌంటింగ్కు ఎనిమిది రోజులే గడువు ఉండటంతో పంటర్లు ఎగబడుతున్నారు. రూ.పది వేలు మొదలుకుని రూ.పది లక్షల వరకూ బెట్టింగ్ పెడుతున్నారు. పోలింగ్ తర్వాత విహార యాత్రలకు వెళ్లిన మండల స్థాయి నాయకులు తిరిగి వస్తుండటంతో బెట్టింగ్లకు ఊపు వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఓట్ల లెక్కింపు తేదీ దగ్గరపడుతుండడంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
నగిరి నియోజకవర్గాన్ని దోచేసిన మంత్రి రోజాను ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు సీపీఐ జాతీయ నేత నారాయణ పిలుపునిచ్చారు. ఇవాళ తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నగిరిలో రోజా ఊళ్లకు ఊళ్లే దోచేసిందన్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాతో నగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసిందని అన్నారు. నగిరిలో మంత్రి రోజా పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి ఎక్కువైందన్నారు.