Elections 2024: అభ్యర్థి అవినాశ్ ను మార్చేందుకు యత్నాలు.. కుండ బద్దలు కొట్టిన షర్మిల..
ABN , Publish Date - Apr 13 , 2024 | 03:10 PM
కడపలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) విమర్శించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
కడపలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) విమర్శించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తాను జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో పుట్టానని షర్మిల చెప్పారు. ఇదే తన జన్మస్థలం అని అన్నారు. వైఎస్ఆర్, వివేకాలు ప్రజా నాయకులుగా గొప్ప పేరు సంపాదించుకున్నారన్నారు. తమతో ఇంట్లో ఎలా ఉండే వారో ప్రజల కోసమూ అలాగే ఉన్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి ఎప్పుడు పిలిచినా పలికే వారని కొనియాడారు.
Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా..
కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తీసుకు రావాలని వైఎస్ కలలు కన్నారు. స్టీల్ ప్లాంట్ వస్తే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని భావించారు. వైఎస్ఆర్ అస్తమయంతో ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన ప్రాజెక్ట్ గా మారింది. చంద్రబాబు ఒక సారి జగన్ రెండు సార్లు శంకుస్థాపన చేశారు. వైఎస్ వివేకా హంతకుడు అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారు. అధికారం అడ్డుపెట్టుకొని అండగా ఉన్నారు. హత్య చేసిన నిందితుడికి మళ్లీ టికెట్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని సీబీఐ అన్ని ఆధారాలు బయట పెట్టింది. అయినా ఎటువంటి చర్యలు లేవు. ఈ అన్యాయాన్ని ఎదురించేందుకే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ మరో వైపు వివేకా హంతకుడు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.
- వైఎస్. షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు
జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..
వైఎస్ వివేకాకు ఎవరి మీదా కోపం ఉండదని ఆయన రాజకీయ అజాత శత్రువు అని ఆమె కుమార్తె వైఎస్.సునీత అన్నారు. అటువంటి మంచి మనిషిని దారుణంగా నరికి చంపారని, తలమీద 7 సార్లు గొడ్డలితో నరికారని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ సభ్యులే చంపారని తెలిసి ఎంతో భయభ్రాంతులకు గురయ్యామన్నారు. వివేకా హత్య తమ ఫ్యామిలీ విషయం కాదన్న సునీత ఇది కడప జిల్లా ప్రజల విషయం అని వివరించారు. హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసని, హత్యచేసిన నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. షర్మిల ఎంపీ అయితే దిల్లీ వరకు మన గొంతుక వినిపించవచ్చని సునీత స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.