Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్‌లో ఎవరికి ఏ ఛాంబర్..?
ABN , Publish Date - Jun 18 , 2024 | 10:45 PM
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రుగులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇప్పటికే కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా.. మరికొందరు మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. డిప్యూటీ సీఎం, మంత్రులకు జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) ఛాంబర్లు కేటాయించడం జరిగింది.
బ్లాక్-01 : సీఎం నారా చంద్రబాబు
బ్లాక్-02 : ఏడుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మంత్రి నాదెండ్ల మనోహర్
పొంగూరి నారాయణ
కందుల దుర్గేష్
వంగలపూడి అనిత
పయ్యావుల కేశవ్
ఆనం రామనారాయణ రెడ్డి
బ్లాక్-03 : ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
గొట్టిపాటి రవికుమార్
కొల్లు రవీంద్ర
గుమ్మిడి సంధ్యారాణి
డోలా బాల వీరాంజనేయుల స్వామి
ఎన్ఎండీ ఫరూక్
బ్లాక్-04 : ఎనిమిది మంది మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
నారా లోకేష్
అనగాని సత్యప్రసాద్
కింజరపు అచ్చెన్నాయుడు
ఎస్. సవిత
టీజీ భరత్
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కొలుసు పార్థసారథి
నిమ్మల రామానాయుడు
బ్లాక్-05 : ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
బీసీ జనార్జన్ రెడ్డి
కొండపల్లి శ్రీనివాస్
వాసంశెట్టి
సత్యకుమార్‌లకు కేటాయిస్తున్నట్లు జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) ఓ ప్రకటనలో తెలిపింది.