Share News

Atchannaidu: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:48 PM

ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేస్తామని అన్నారు.

Atchannaidu: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
Minister Atchannaidu

అమరావతి: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయానికి (APCNF)“గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటి” అవార్డు వచ్చిన సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని 60 లక్షల మందికి ఈ విధానం చేరువ చేయాలన్న సంకల్పంతో ఉన్నామని వివరించారు. APCNF చేస్తున్న కృషి, పనితీరును గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినందుకు పోర్చుగల్‌కు చెందిన “కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్” కు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఇది కూడా చదవండి: Nara Lokesh: యూకే మాజీ ప్రధానిని కలిసిన నారా లోకేష్

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 508 ఎంట్రీల్లో APCNF ఎంపిక కావడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. రైతుల సంక్షేమంతో పాటు క్లైమేట్ ఎమర్జెన్సీ‌ని దృష్టిలో పెట్టుకుంటామని చెప్పారు. APCNF ప్రకృతి వ్యవసాయ మోడల్‌‌కు గ్లోబల్ స్థాయి గుర్తింపు రావడం అత్యంత ఆనందంగా ఉందని తెలిపారు. APCNF తరపున ప్రకృతి వ్యవసాయ మార్గంలో ప్రయాణిస్తున్న 10 లక్షల మంది రైతుల ప్రతినిధిగా నాగేంద్రమ్మ ఈ అవార్డు అందుకోవడం శుభపరిణామమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

Mastan Vali: షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారు.. వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్

Budda Venkanna: నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే... తాచుపాము జగన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 04:52 PM