Nara Lokesh: సోషల్ మీడియాలో మారుమోగుతోన్న నారా లోకేశ్ పేరు
ABN , Publish Date - Jul 08 , 2024 | 07:15 PM
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో హ్యాఫ్ ట్యాగ్‌తో భారీగా పోస్టులు కనిపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థుల సమస్యను మంత్రి నారా లోకేశ్ వెంటనే పరిష్కరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో #Thankyounaralokesh హ్యాఫ్ ట్యాగ్‌తో భారీగా పోస్టులు కనిపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థుల సమస్యను మంత్రి నారా లోకేశ్ వెంటనే పరిష్కరించారు. మంత్రి లోకేశ్ పనితీరు పట్ల విద్యార్థులు సంతృప్తి చెందారు. థాంక్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. నారా లోకేశ్ పేరు సోషల్ మీడియాలో నంబర్ వన్ స్థానంలో ఉంది.
ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 25 మంది దివ్యాంగ విద్యార్థులు పై చదువుల కోసం ఇబ్బంది పడ్డారు. అర్హత ఉన్నప్పటికీ ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, ఐఐటీలో సీటు విషయంలో జాప్యం జరిగింది. ఆ విషయాన్ని స్టూడెంట్స్, పేరంట్స్ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను మంత్రి లోకేశ్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ విద్యార్థుల అడ్మిషన్ సంగతి చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉండటంతో విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. సమస్య పరిష్కారం అయిన తర్వాత మంత్రి లోకేశ్‌ను విద్యార్థులు కలిశారు. సమస్య పరిష్కారం అయ్యేందుకు చొరవ చూపడంతో ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read: Anant-Radhika wedding: పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు !
ల్యాప్‌టాప్స్ అందజేత
తనను కలిసిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ ల్యాప్ టాప్‌లు అందజేశారు. సమస్యను వేగంగా పరిష్కరించిన అధికారులను అభినందించారు. తమ ప్రభుత్వ విధానం ఇది నారా లోకేశ్ అని చేతల్లో చూపించారు. సింపుల్ గవర్నమెంట్- ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని తేల్చి చెప్పారు. విద్యార్థుల సమస్య పరిష్కారమే ఇందుకు ఉదహరణ అని వివరించారు.
Read Latest AP News And Telugu News