Minister Lokesh: మంత్రి లోకేష్ కృషితో ..ఏపీకి మరో భారీ పరిశ్రమ
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:21 PM
మంత్రి నారా లోకేష్ కృషితో ఏపీకి మరో భారీ పరిశ్రమ రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. లోకేష్ అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. లోకేష్ కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది.
అమరావతి: ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇందులో భాగంగానే మంత్రి లోకేష్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానుంది. రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఏపీలో రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి లోకేష్ ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారు.
లోకేష్ అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. లోకేష్ కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది. గుజరాత్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో మాత్రమే ఇంత పెద్దఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది. ఏపీలో రిలయన్స్ సంస్థ 500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది.
అమెరికా పర్యటనకు ముందు మంత్రి లోకేష్ ముంబైలో పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఆ సమయంలో రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీని కూడా కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించారు. రాష్ట్రంలో పెట్టబడులకు సంబంధించి అనంత్ అంబానీ, మంత్రి లోకేష్ నడుమ ఆనాడే అవగాహన కుదిరింది. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్‌తో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.
ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి లోకేష్ కృషితో ఇప్పటికే ఏపీలో సౌర, పవన విద్యుత్ రంగంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్ ముందుకు వచ్చింది. రిలయన్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,50,000 మందికి ఉపాధి అవశాకాలు లభించనున్నాయి. ముంబైలో చర్చల తర్వాత కేవలం 30 రోజుల వ్యవధిలోనే పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. ఏపీ ప్రభుత్వ స్పీడ్ ఆప్ డూయింగ్ బిజెనెస్‌కు ఈ పెట్టుబడిలే నిదర్శనం. అనేక ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
YS JAGAN: జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా.. న్యాయమూర్తి ఏమన్నారంటే
YSRCP: రీ సర్వే డ్రోన్లు ఢమాల్.. రూ. 200 కోట్లు వృథా చేసిన జగన్
Bhanuprakash: అసెంబ్లీకి జగన్ గైర్హాజరుపై భానుప్రకాష్ సంచలన కామెంట్స్
Read Latest AP News and Telugu News