AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోదం
ABN , Publish Date - Dec 19 , 2024 | 02:05 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం (Cabinet meeting) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరవై ఒక్క అంశాలు ఏజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.
జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి పనులను రద్దుచేసి తిరిగి మాడిఫై చేసిన ఐదు పనులకు రీ టెండర్ పిలిచేందుకు, అగ్రిమెంటు గడువు పొడిగించేందుకు క్యాబినెట్‌లో ఆమోదించారు. అమరావతి రాజధానిలో మొత్తం 20 ఇంజినీరింగ్ పనులకు రూ.8821 కోట్లు పరిపాలన అనుమతులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 25 ఇంజినీరింగ్ పనులు చేపట్టేందుకు రూ.24316 కోట్లు మంజూరుకు ప్రతిపాదనకు ఆమోదించారు. 176 మంజూరు కేడర్ స్ట్రెంత్‌ను నూతనంగా ఏర్పాటైన 12 నగర పంచాయతీలు మున్సిపాలిటీలకు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు క్యాబినెట్‌లో ఆమోదించారు.
అమోదించిన కీలక బిల్లులివే..
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 14 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
అమరావతి అభివృద్ధికి హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు కేఎఫ్ డబ్ల్యు నుంచి రూ.16 వేల కోట్లు రుణం తీసుకోవడానికి ఆమోదం.
ఏపీ రిసర్వే ప్రాజెక్టుకు సంబంధించి గ్రామ కంఠం భూముల సర్వే కోసం తీసుకున్న 679 సూపర్ న్యుమరి డిప్యూటీ తహసీల్దార్‌లను మరో రెండేళ్లు కొనసాగించేందుకు అనుమతి
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర ఏర్పాటుకు 50 ఎకరాల 20 సెంట్లు భూమికి ఓకే చెప్పిన క్యాబినెట్
స్టాంప్ డ్యూటీ మినహాయింపులకు ఆమోదం..
ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు కర్నూలు రూరల్ మండలంలో బి టాండ్రపాడు గ్రామంలో కేటాయిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్లో ఆమోదం
వరద బాధితులకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు చేస్తూ క్యాబినెట్‌లో ఆమోదం
ధాన్యం కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు అదనంగా మరి రూ.1000 కోట్లు రుణం జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ నుంచి తీసుకొని పౌరసరఫరాల శాఖకు బదిలీ చేసేందుకు క్యాబినెట్‌లో ఆమోదం
పోలవరం కొత్త టెండర్లకు అనుమతి..
పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులకు ఒప్పందం ఇప్పటికే గడువు ముగిసినందున టెండర్లు పిలవడానికి క్యాబినెట్‌లో అనుమతి.
క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీ, ఎన్ఆర్ఈడీసీఏపీ జాయింట్ వెంచర్ ప్రతిపాదనకు క్యాబినెట్లో ఆమోదం.
ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవీ మోడల్ స్కూలు, ఏపీ రెసిడెన్షియల్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, నోట్ బుక్కులు, ప్రాక్టికల్ రికార్డుల కోసం రూ.32 కోట్ల 45 లక్షల 88వేల 679కు క్యాబినెట్‌లో పరిపాలనా అనుమతి మంజూరు.
475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ డిసెంబర్ 2024 నుంచి మధ్యాహ్న భోజనం అమలుకు నిధులు కేటాయింపునకు క్యాబినెట్‌లో పరిపాలన అనుమతి.
ఈ వార్తలు కూడా చదవండి
Cabinet meeting: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం..
Pawan Kalyan: ‘జల్‌జీవన్’లో జనం భాగస్వామ్యం
Kakinada: డమ్మీ పిస్టల్‌తో బెదిరించి.. బంగారం దోచేసి..!
Read Latest AP News and Telugu News