Share News

Unstoppable Show: అన్‌స్టాపబుల్ సీజన్-4 టాక్ షోలో సీఎం చంద్రబాబు సందడి..

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:49 PM

సినీ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహించే అన్‌స్టాపబుల్ సీజన్-4 (Unstoppable season-4) టాక్ షో చిత్రీకరణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Unstoppable Show: అన్‌స్టాపబుల్ సీజన్-4 టాక్ షోలో సీఎం చంద్రబాబు సందడి..

అమరావతి: సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా నిర్వహించే అన్‌స్టాపబుల్ సీజన్-4 (Unstoppable season-4) టాక్ షోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందడి చేయనున్నారు. ఈ మేరకు ఫస్ట్ ఎపిసోడ్ చిత్రీకరణలో చంద్రబాబు (CM Chandrababu) పాల్గొన్నారు. సీజన్-4లో ఫస్ట్ గెస్ట్‌గా ముఖ్యమంత్రి రాబోతున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇవాళ (ఆదివారం) చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ సీజన్-2లో సీఎం చంద్రబాబు పాల్గొడి సందడి చేశారు. పలు జీవిత విశేషాలను బాలయ్యతో పంచుకున్నారు. ఆ సమయంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు.


నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్‌స్టాపబుల్ టాక్ షోకి హాజరయ్యారు. అయితే గత సీజన్‌లో తెలుగుదేశం పార్టీ సంక్షోభం, నాటి పరిస్థితులపై ఆయన బాలయ్యతో మాట్లాడారు. ఈసారి కూటమి గ్రాండ్ విక్టరీ, ఎన్నికలకు ముందు, తదుపరి పరిణామాలను పంచుకోనున్నారు. టాక్ షోలో బాలయ్యతో కలిసి సీఎం చంద్రబాబు పలు టాస్క్‌లు ఆడనున్నారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై టీడీపీ శ్రేణులు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ సీజన్-4 ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈసారి బాలయ్య, చంద్రబాబు కలిసి వస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

TDP Police: దివ్వెల మాధురి తిరుమల పొలీసుల నోటీసులు..

Andhra Pradesh:నడిరోడ్డుపై వదిలేశారు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం..

Anitha: విద్యార్థిని మరణం విషాదకరం: హోం మంత్రి అనిత

Updated Date - Oct 20 , 2024 | 01:50 PM