Share News

CM Chandrababu: పరదాల పాలన నుంచి ప్రజాపాలనకు శ్రీకారం..

ABN , Publish Date - Jun 13 , 2024 | 08:24 PM

వైసీపీ పరదాల పాలన నుంచి ప్రజాపాలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) శ్రీకారం చుట్టారు. గత సీఎం జగన్(Former CM Jagan) ఎక్కడికెళ్లినా పరదాలు, బారికేడ్లు, షాపుల మూత, రోడ్లు బ్లాక్, చెట్ల నరికివేత ఉండేది. ఇప్పుడు ప్రజాపాలన, ప్రజలే దేవుళ్లు అంటూ చంద్రబాబు నయా ట్రెండ్ మెుదలుపెట్టారు. ఓపెన్ టాప్ కారులో ప్రజల మధ్యకు ధైర్యంగా వెళ్తున్నారు.

CM Chandrababu: పరదాల పాలన నుంచి ప్రజాపాలనకు శ్రీకారం..

అమరావతి: వైసీపీ పరదాల పాలన నుంచి ప్రజాపాలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) శ్రీకారం చుట్టారు. గత సీఎం జగన్(Former CM Jagan) ఎక్కడికెళ్లినా పరదాలు, బారికేడ్లు, షాపుల మూత, రోడ్లు బ్లాక్, చెట్ల నరికివేత ఉండేది. ఇప్పుడు ప్రజాపాలన, ప్రజలే దేవుళ్లు అంటూ చంద్రబాబు నయా ట్రెండ్ మెుదలుపెట్టారు. ఓపెన్ టాప్ కారులో ప్రజల మధ్యకు ధైర్యంగా వెళ్తున్నారు.


ఐదేళ వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్ సచివాలయం, అసెంబ్లీకి వెళ్లాలంటే బారికేడ్లు పెట్టి వందలాది మంది పోలీసులు మెుహరించి ఎటు నుంచి ఎవరు వస్తారో అని వలలు పట్టుకుని నిలబడేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఓపెన్ టాప్ కారులో పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. గత ముఖ్యమంత్రి రాళ్లు వేస్తారనే భయంతో తెరచాపలు, వలలు అడ్డం పెట్టుకుని తిరిగారు. కానీ అమరావతిలో అడుగడుగునా చంద్రబాబుకు ప్రజలు, రాజధాని రైతులు పూల వర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు.

"ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చామని, వారి బాధలు తెలుసుకోవడం మన కర్తవ్యం, విధి. బారికేడ్లు ఏర్పాటు చేసే అధికారులపై చర్యలు తప్పవంటూ" సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం ఆయన తిరుపతికి వెళ్లినప్పుడు కూడా సామాన్య భక్తులకు ఆంక్షలు, ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా ప్రతినిధులతో సమావేశ సమయంలోనూ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చూశారు.

Pawan Kalyan: జూన్ 20తర్వాత పిఠాపురం వస్తా: పవన్ కల్యాణ్

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన అమరావతి రైతులు..


గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనూ ట్రాఫిక్ నిలిపివేయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నప్పుడు, తర్వాతా ప్రజలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆయన చూసుకున్నారు. బుధవారం సచివాలయానికి వెళ్లే సమయంలోనూ అమరావతి రైతులు పూలతో స్వాగతం పలికినప్పుడు... తన కాన్వాయ్ నుంచి దిగి మరీ వారితో ముచ్చటించారు. దీంతో ఇన్నేళ్లకు తమ గోడు వినే నాయకుడు వచ్చారంటూ వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇదే రకమైన ప్రజా పాలనను రాబోయే రోజుల్లోనూ చూస్తారంటూ టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.

ఇది కూడా చదవండి:

AP Politics: చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోండి: ఎమ్మెల్సీ అనురాధ

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన అమరావతి రైతులు..

Updated Date - Jun 13 , 2024 | 08:39 PM