Share News

CM Chandrababu: ఢిల్లీ టూర్‌పై మంత్రులు, అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Jul 02 , 2024 | 09:55 PM

రేపటి(బుధవారం) ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) మంత్రులు పయ్యావుల, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రుల ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కసరత్తు చేశారు.

CM Chandrababu: ఢిల్లీ టూర్‌పై మంత్రులు, అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు..

అమరావతి: రేపటి(బుధవారం) ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) మంత్రులు పయ్యావుల, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రుల ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కసరత్తు చేశారు. పోలవరం, రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏఏ ప్రాజెక్టులు, స్కీములు కేంద్రం నుంచి రాబట్టొచ్చో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రధానికి వివరించి.. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.


వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధంగా విధ్వంసానికి గురైందో, వ్యవస్థలన్నీ ఏ విధంగా నిర్వీర్యం అయ్యాయో కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రంగాలకు రాయితీ, వ్యవసాయ అనుబంధ రంగాలకు పోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించేలా కేంద్ర పెద్దలను కోరనున్నారు. ముఖ్యంగా ఏపీలో పోలవరం పూర్తి చేయడం, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించేలా కేంద్రమంత్రుల ఎదుట ప్రతిపాదనలు పెట్టనున్నారు.


ప్రధాని మోదీ, అమిత్ షాలతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు బీసీ జనార్దన్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ సహా తదితరులు ఢిల్లీ టూర్‌కి వెళ్లనున్నారు. కేంద్రంలో ఎన్డేయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు, మోడీ ప్రధాని అయ్యేందుకు చంద్రబాబు కింగ్ మేకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి వరాల జల్లు కురవనుందో వేచి చూడాలి.

Updated Date - Jul 02 , 2024 | 09:55 PM