Share News

CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

ABN , Publish Date - Nov 16 , 2024 | 09:03 AM

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీని, పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలిసి కీలక విసయాలపపై చర్చించారు. బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన నిధులతోపాటు ఏపీ బడ్జెట్‌లోని లోటును సైతం పూడ్చాలని మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్జప్తి చేశారని సమాచారం.

CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బిజీ బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌‌కు సీఎం హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు. ఈ సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.


ఈరోజు థానే, భివాండి ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. రేపు(ఆదివారం) సియోన్ కొలివాడి, వర్లీ ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు ఇవ్వబోతున్న రుణాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా వచ్చేలా చూడాలని కోరినట్లు తెలుస్తుంది.


అలాగే బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన నిధులతోపాటు ఏపీ బడ్జెట్‌లోని లోటును సైతం పూడ్చాలని మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్జప్తి చేశారని సమాచారం. నదుల అనుసంధంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అంశాలపై కులంకుషంగా చర్చించారు. అలాగే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌తో సైతం సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే గతంలో రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యమైంది. ఆ దేశంతో భాగస్వామ్యాన్ని పునరుద్దరించాలని సీఎం కోరారు. దీనికి సైతం ఆయన ఓకే అన్నట్లు సమాచారం.

Updated Date - Nov 16 , 2024 | 09:05 AM