CM Chandrababu: బీసీ వెల్ఫేర్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Dec 23 , 2024 | 06:45 PM
బీసీ వెల్ఫేర్‌పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయ పరమైన పోరాటం చేస్తున్నామని అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అమరావతి: బీసీ వెల్ఫేర్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై కసరత్తు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయపరమైన పోరాటం చేస్తున్నామని అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లలో వసతుల కల్పన, బాలికల హాస్టళ్ల తక్షణ మరమ్మతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల తొలగింపు కాదు...పింఛన్ల తనిఖీ జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. స్కిల్ ఎడ్యుకేషన్ కోసం 104 బీసీ హాస్టళ్లలో ఎస్.ఆర్.శంకరన్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ALSO READ: YSRCP: మేయర్, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం
పెట్టుబడులపై సీఎస్ నీరబ్ కుమార్ కీలక చర్చ..
అమరావతి: ఏపీసచివాలయంలో ఎస్ఐపీసీ సమావేశం ఇవాళ(సోమవారం) జరిగింది. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎస్ఐపీసీ)సమావేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు, సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కమిటీలో చర్చించారు.
ఈ ప్రతిపాదనలకు తదుపరి ఆమోదం నిమిత్తం ఎస్ఐపీబీకి సిఫార్సు చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ ట్రాకర్ అంశాన్ని అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి కల్పనా యూనిట్లను పర్యవేక్షించాలని ఆయా శాఖలను సీఎస్ ఆదేశించారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖాధిపతి సహాయంతో జీఎండీఐసీ, రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతులు యూనిట్ల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. 2వేల మందికి ఉపాధి కల్పించే యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి టీసీఎస్ చేసిన ప్రతిపాదనకు ఎస్ఐపీబీకి సిఫార్సు చేశారు. రూ. 65 వేల కోట్లతో వివిధ జిల్లాల్లో 500 యూనిట్ల ఏర్పాటుకు రిలయన్స్ చేసిన ప్రతిపాదనకు కూడా ఎస్ఐపీబీకి సిఫార్సు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Nara Lokesh : మరోసారి ఉదారత చాటుకున్న మంత్రి నారా లోకేశ్.. ఏం చేశారంటే
Madhavi Reddy: వైసీపీ నేతలు అవి కూడా ఆక్రమించారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Atchannaidu: తప్పు చేసిన వారు తప్పించుకోలేరు.. అచ్చెన్న వార్నింగ్
Viral News: నెల్లూరులో.. యువకుడిని చితక్కొట్టిన దెయ్యం..!
Read Latest AP News And Telugu News