CM Chandrababu: రాజ్యాంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:01 PM
CM Chandrababu: విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని సీఎం చంద్రబాబు చెప్పారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టారని అన్నారు. ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందని చెప్పారు.
అమరావతి: రాజ్యంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖుల చిత్రాలు, చరిత్రను తెలిపేలా వినూత్నంగా అసెంబ్లీ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుందని.. దీంతో ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించేలా క్యాలెండర్ రూపొందించినట్లు తెలిపారు. 2025 సంవత్సరానికి రూపొందించిన నూతన అసెంబ్లీ క్యాలెండర్‌ను తన నివాసంలో ఇవాళ(శనివారం) సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గోబ్యాక్ సైమన్ అంటూ తెగువ చూపిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు రాజ్యాంగ రచనలో భాగస్వామి కావడం గర్వకారణమని అన్నారు.
రాజ్యాంగంలోని స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాల రూపకల్పనలో సహాయ సహకారాలు టంగుటూరి ప్రకాశం పంతులు అందించారని చెప్పారు. బోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభా సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని అన్నారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ జాతీయ భాష, న్యాయవ్యవస్థ, స్వాతంత్ర్యం, మానవ అక్రమ రవాణాపై చేసిన కీలక సూచనలకు రాజ్యాంగ సభ ఆమోదం తెలిపిందని చెప్పారు. జాతీయ భాష గురించి మోటూరి సత్యనారాయణ, అధికార వికేంద్రీకరణ, అత్యవసర అధికారాలు రెండు సభలు ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుపై ఎన్జీ రంగా సూచనలు చేశారన్నారు. వీరితో పాటు వీసీ కేశవరావు, అల్లాడి కృష్ణస్వామి, మొసలికంటి తిరుమలరావు, కళా వెంకట్రావులు తమ వంతు సేవలు అందించారని గుర్తుచేశారు. ఇలాంటి వారి చిత్రపటాలతో అసెంబ్లీ క్యాలెండర్‌ను రూపొందించి ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు తో పాటు అసెంబ్లీ సెక్రటెరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ హాజరయ్యారు.
తెలుగు నేల పులకిస్తోంది: సీఎం చంద్రబాబు
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణపై సీఎం చంద్రబాబు ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని చెప్పారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టారని అన్నారు. ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోందని చెప్పారు. అలాగే ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు పేరు పెట్టడం కూడా అభినందనీయమన్నారు. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగుభాషాభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మహా సభలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ నిర్వాహకులకు సీఎం చద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం
Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం
Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..
Read Latest AP News and Telugu News