Share News

CM Chandrababu: క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 24 , 2024 | 07:48 PM

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగరోజు అని సీఎం చంద్రబాబు వివరించారు.

CM Chandrababu:  క్రిస్మస్‌  శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. యుగకర్త ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగరోజు అని వివరించారు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా ఏసుక్రీస్తు నిరూపించారని సీఎం చంద్రబాబు చెప్పారు. సర్వ మానవాళికి మేలు కలగాలని ఏసుప్రభువును ప్రార్థిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రేమ, కరుణ, శాంతికి ప్రతిరూపం క్రిస్మస్: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Mandipalli-Ramprasad-Reddy.jpg

అమరావతి: సంతోషంగా ఉండటం అంటేనే క్రిస్మస్‌కు గుర్తు అని, ప్రతి ఒక్కరూ క్రీస్తు తత్వాన్ని అనుసరించాలని, ప్రేమను పంచి, పగను తుంచాలని క్రీస్తు సూక్తిని పాటించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం గల నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు రూ. 5 కోట్ల ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వంలో రూ. 70 కోట్ల ఖర్చు చేశామని అన్నారు. మైనార్టీలు, క్రిస్టియన్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. క్రైస్తవుల ఆర్థికాభివృద్ధికి స్వయం ఉపాధి రుణాలకు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పర్వదినం క్రిస్మస్‌ అని అన్నారు. దైవ కుమారుడి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. లోక రక్షకుడైన ఏసు ప్రభువు రాష్ట్ర ప్రజల అందరి పైన తన చల్లని దీవెనలు అందించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరుకున్నారు.


క్రీస్తు బోధనలు ఆచరణీయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Kondapalli-Srinivas.jpg

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని చెప్పారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, పాపుల రక్షణ కోసం, శాంతి సందేశం కోసం దైవ దూతగా వచ్చి ఏసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయాకరుణకు మూర్తీభవించిన రూపమే జీసస్ అని అన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగని, వారి ఆశయాలను వ్యాప్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మేలు చేసేవని అన్నారు. ఎవరైతే పేద ప్రజలతో దయతో ఉంటారో, వారికి క్రీస్తు ఆశీస్సులు ఉంటాయని, పేద ప్రజలతో ప్రేమతో, దయతో ఉండాలని భోధించిన మహనీయులు ఏసుక్రీస్తు అని, వారి గొప్పసందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్రిస్మస్ అంటే గుర్తుకు వచ్చేది ప్రేమ, శాంతి, దయ, కరుణ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 08:01 PM