Share News

CM Chandrababu: సీఆర్డీఏలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Aug 02 , 2024 | 07:09 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 12 అంశాలపై సమావేశంలో చర్చించారు.

CM Chandrababu: సీఆర్డీఏలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో భూమి పొందిన వారు, మళ్లీ నిర్మాణాలు చేపట్టే అంశంపై సీఎం చర్చించారు. ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా కావడానికి ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలి, ఎవరికి భూములు కేటాయించాలనే అంశంపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. సంపద సృష్టికి కేంద్రాలుగా అమరావతిని మార్చేవారికి భూ కేటాయింపులు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. టాప్ 10 కాలేజీలు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆస్పత్రులు ఏర్పాటు కావాలని ఆదేశించారు. జీవో 207 ప్రకారం 8352 స్వేర్ కిలోమీరట్ల పరిధిలోనే రాజధాని ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఆ గ్రామాలను వెనక్కి తేవాలి..

గతంలో గుర్తించిన విస్తీర్ణమే CRDA పరిధిగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను వెనక్కి తేవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ఆర్ 5 జోన్‌పైనా అధికారులు చర్చించారు. గత ప్రభుత్వం చట్టవ్యతిరేక నిర్ణయాలపై లోతైన సమీక్ష జరపాలని అధికారులు పట్టుబట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, 4 లైన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనంతరం మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖామంత్రి నారాయణ మీడియాకు సీఆర్డీఏ అథారిటీ నిర్ణయాలు వెల్లడించారు.


  • సీఆర్డీలో చర్చించిన కీలక అంశాలివే...

  • రైతులు ఆరోజు సీఎం మీద నమ్మకంతో ఒక్క లిటిగేషన్ లేకుండా ఇచ్చారు

  • ఈ రోజు వారికి ఎంత కౌలు ఉందో అదే ఐదేళ్ల పాటు కొనసాగిస్తాం

  • అమరావతి పెన్షన్లు కూడా ఇదేలా మరో ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయం

  • సీఆర్డీఏకు 778 మంది ఉద్యోగులు ఉన్నారు

  • ఇప్పుడు 249 మంది ఉన్నారు.. అమరావతి రాజధాని నిర్మాణం మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించాం

  • కాబట్టి 778 మందిని తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం

  • గతంలో 47 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు. వీరిలో 15 మంది వర్క్ పూర్తి అయిపోయింది

  • మిగిలిన వారినే తీసుకుంటాం

  • 8352,69 చదరపు కిలో మీటర్లు అమరావతి పరిధి దాన్ని గత ప్రభుత్వం 6993.24చదరపు కిలో మీటర్లుకు తగ్గించింది

  • ఈరోజు అధారిటీలో గతంలో ఎంత ఉందో అంతే ఉండేలా చర్యలు తీసుకుంటాం.

  • దీని వల్ల పల్నాడు, బాపట్ల అథారిటీలు కూడా ఉంటాయి వాటి ఏరియా తగ్గుతుంది

  • క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించాం... వీటిలో 4 గ్రామాలను మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిపింది

  • దీని వల్ల మాస్టర్ ప్లాన్ కొంత డిస్ట్రబ్ అయ్యింది. దాన్ని తిరిగి సరిచేశాం

  • సింగపూర్ ప్రభుత్వంతో సీడ్ క్యాపిటల్ కట్టేలా నిర్ణయం జరిగింది. గత ప్రభుత్వం రద్దు చేసింది.


  • అథారిటీ తిరిగి వారితో మాట్లాడాలని నిర్ణయించాం

  • అధికారులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బిల్డింగ్‌లు హైదరాబాద్ ఐఐటీకి వాటి పటిష్టతపై పరిశీలనకు ఇచ్చాం

  • ఐకానిక్ బిల్డింగ్‌లు చెన్నై ఐఐటీ వారికి పటిష్టతపై అధ్యయనానికి ఇచ్చాం. వారి రిపోర్టు బేస్ చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించాం

  • కరకట్ట రోడ్డు ఫోర్ లైన్ అని టెండర్ ఇచ్చాం. గత ప్రభుత్వం టూలైన్ చేసింది

  • ఇప్పుడు ఆ రోడ్డును ఫోర్ లైన్‌లు కింద పిలిచి డివైడ‌ర్‌తో నిర్మించడానికి టెండర్ పిలవాలని అథారిటీ నిర్ణయించింది

  • గ్రీడ్ రోడ్లలో తూర్పు నుంచి పడమరకు ఈ 1, ఈ2 ఇలా కలుస్తాయి, ఈ5, ఈ11, ఈ13, ఈ15 రోడ్లను కూడా నేషనల్ హైవేకి కలపాలని నిర్ణయించాం

  • హిల్స్ ఉన్న చోట వాటి పక్క నుంచి నేషనల్ హైవేకు కలిపేలా ఏడాదిలో వాటిని పూర్తిచేయాలని నిర్ణయించాం.

  • నాలుగు లైన్లు కరకట్ట రోడ్డు రాజధాని పరిధి చివర వరకూ ఉంటుంది

  • మరో ఆరు బ్రిడ్జిలు కృష్ణారివర్‌లో వస్తున్నాయి వీటన్నింటిని ఐకానిక్ బ్రిడ్జ్‌గా నిర్మించాలని సీఎం చంద్రబాబు అన్నారు

  • ఇబ్రహీంపట్నం వద్ద ఐకానిక్ బ్రిడ్జ్ ‌పై మరోసారి స్టడీ చేయమన్నారు

  • 130 మందికి ఇప్పటికే సైట్ల ఇచ్చాం. ఆ అధికారులతో మాట్లాడి ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు ఎవరు ఇన్ యాక్టివ్‌గా ఉన్నారు వారితో మాట్లాడుతాం.

  • బిట్స్ పిలాని లాంటి సంస్ధలతో మాట్లాడాలని చెప్పారు

  • సీడ్ యాక్సిస్ రోడ్డుపైనా రైతులతో మాట్లాడాం. అక్కడ ల్యాండ్ పూలింగ్ ఆఫీసు కూడా పెట్టాం

  • 217 చదరపు కిలో మీటర్లకు అందరికీ ఒకటే పాలసీ ఇవ్వడం జరిగింది సీఎం ఇదే వారికి చెప్పమన్నారు

  • అన్ని సంస్థలు తిరిగి రావడానికి విల్లింగ్‌తో ఉన్నారు వారికి మరో రెండేళ్లు టైం పొడిగిస్తున్నాం

  • ఆర్ ఫైవ్ జోన్‌పై ఇంకా పూర్తి అవగాహనకు రాలేదు దానిపై లీగల్‌గా స్టడీ చేస్తాం.


  • ఇప్పుడు కూడా తొమ్మిది నగరాలు ఇక్కడ ఉన్నాయి అవి కొనసాతాయి

  • నావీ ముంబైకి 2017లోనూ వెళ్లాను. ఫైనాన్సియల్‌గా ఎలా చేస్తున్నారని అడిగాం

  • ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ లాంటి సిస్టం తెచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు

  • ఈరోజు వారి వద్ద రూ.7 వేల కోట్లు డిపాజిట్ ఉంది... వారు పేదలకు ఈడబ్ల్యూఎస్ కడుతున్నారు.

  • 26.5 లక్షలు నిర్మాణానికి వారు కట్టాల్సి ఉంటుంది... దశలవారీగా వారు కడతారు ముంబై లాంటి ప్రాంతాల్లో ఇది ఎఫర్డబుల్ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును సీఎం టేకప్ చేయమన్నారు.. మిడిల్ ఇన్ కం వారికి హౌసెస్ కట్టమన్నారు.. ఎంఐజీ, ఎల్ఐజీల తరహాలో కట్టాలన్నారు

  • సీఆర్డీఏ కమిషనర్ ర్యాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తామన్నారు చెన్నై ఐఐటీ బృందం చూశాక అ పని చేయాలని సూచించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 07:30 PM